Asim Munir: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక

తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.

New Update
Pakistani Taliban's Open Threat To Asim Munir, Know Details

Pakistani Taliban's Open Threat To Asim Munir, Know Details

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్(pak-vs-afg) మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా తెహ్రీక్ ఇ తాలిబన్(pakistan taliban) పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌(Asim Munir)ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశాయి. తమమీదకి సైనికులను పంపడం మాని.. ఉన్నతాధికారులే యుద్ధానికి దిగాలంటూ వార్నింగ్ ఇచ్చాయి. అంతేకాదు అక్టోబర్‌ 8న ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆ సంస్థ జరిపిన దాడి దృశ్యాలను కూడా విడుదల చేసింది. 

Also Read: చీకటి నింపిన దీపావళి.. కంటిచూపు కోల్పోయిన 14 మంది పిల్లలు

Pakistani Taliban's Open Threat To Asim Munir

టీటీపీ(tdp) విడుదల చేసిన ఓ వీడియోలో టీటీపీ కమాండర్‌ కాజిమ్ కనిపించినట్లు పాక్‌ అధికారులు తెలిపారు. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కో అంటూ  ఆయన ఆసిం మునీర్‌ను హెచ్చరించాడు. అయితే ఈ బెదిరింపులపై పాక్ అధికారులు సీరియస్ అయ్యారు. కాజిమ్‌ తలపై ఏకంగా రూ.10 కోట్ల పాకిస్థానీ రివార్డును ప్రకటించారు. అతడి దుకంటి ఎవరైనా సమాచారం ఇస్తే ఆ డబ్బు మొత్తం ఇస్తామని స్పష్టం చేశారు. మరోవైపు తమ భూభాగాన్ని వాడుకుంటున్న టీటీపీ ఉగ్రవాదులపై అఫ్గాన్ కఠినంగా చర్యలు తీసుకోవాలని పాక్ అధికారులు డిమాండ్ చేశారు.  

Also Read: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో మహమ్మరి.. తొలి కేసు నమోదు!

ఇదిలాఉండగా సరిహద్దుల్లో దాడులకు పాల్పడే తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారనే పాక్‌ ఆరోపణలను అఫ్గాన్ ఖండించింది. ఈ వివాదమే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యింది.  దీంతో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో భాగంగా ఇటీవల పాక్‌ దాడులు చేసింది. దీంతో అఫ్గాన్‌ కూడా పాక్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. కొన్నిరోజుల పాటు ఇరుదేశాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. చివరికి ఖతార్ రాజధాని దోహాలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే తాజాగా టీటీపీ ఉగ్రవాదులు పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ను హెచ్చరిస్తూ వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు..బానిసత్వం నుంచి బయటపడ్డ 25 లక్షల భారతీయ కార్మికులు

Advertisment
తాజా కథనాలు