/rtv/media/media_files/2025/10/23/mpox-2025-10-23-11-17-56.jpg)
అంటువ్యాధుల భయం వీడటం లేదు. కోవిడ్ దగ్గర నుంచీ ఏదో ఒక కొత్త వైరస్ భయపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ తాలూకా కొత్త వేరియంట్ అంటువ్యాధి నెదర్లాండ్స్‌లో కనిపించింది. ఆ దేశ ఆరోగ్య, సంక్షేమం, క్రీడా మంత్రి జాన్ ఆంథోనీ బ్రూయిన్ పార్లమెంటుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 17న దీనిని గుర్తించామని...పరీక్షల తర్వాత దానిని మంకీపాక్స్ వేరియంట్1బిగా నిర్థారించామని తెలిపారు. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ECDC), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని జాన్ ఆంథోన్ చెప్పారు. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉందని ఆయన తెలిపారు.
First Case Of New Mpox Variant Detected In Netherlandshttps://t.co/FL00iWFXRqpic.twitter.com/dyEZgJhgag
— NDTV WORLD (@NDTVWORLD) October 22, 2025
నెదర్లాండ్స్‌లోనే మొదలైంది..
అయితే నెదర్లాండ్స్‌లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ వ్యాపించిన వ్యక్తి దేశం వదిలి బయటకు ఎక్కడికీ వెళ్ళలేదని తెలుస్తోంది. దానిని బట్టి నెదర్లాండ్స్‌లోనే వ్యాపించిందని నిర్థారించారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచారు. అతను అంతకు ముందు తిరిగి ప్రదేశాలు, కలిసిన వ్యక్తులను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. మంకీపాక్స్ వేరియంట్ 1బి ఒక వైరల్ వ్యాధని నెదర్లాండ్స్ ప్రభుత్వం చెబుతోంది. ఇది ప్రధానంగా చర్మం నుంచి చర్మానికి వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇది సోకిన వారికి జ్వరం, అలసట, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, దద్దుర్లు ,వెన్నునొప్పి లక్షణాలు కనిపిస్తాయి.
మంకీపాక్స్ వ్యాధి చర్మం, నోటి ద్వారా, ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నా తొందరగా వ్యాపిస్తుందని నెదర్లాండ్స్ ఆరోగ్యశాఖ తెలిపింది. కలుషితమైన దుస్తులు, బెడ్ షీట్లు, తువ్వాళ్లు లేదా ఉపయోగించిన వస్తువుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు, టాటూ పార్లర్ మరికొన్ని చోట్ల శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారు.
⚠️Add Netherlands 🇳🇱 to the growing list of countries with community spread of MPOX 1b.
— Dr Richard Hirschson (@richardhirschs1) October 22, 2025
Mpox clades Ib and Ilb have become global diseases, while clades la and lla remain primarily African diseases.https://t.co/gFWVLMB3R0#Mpox#pandemic#vaccinationhttps://t.co/wjYuPi9UOJ