Saudi: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు..బానిసత్వం నుంచి బయటపడ్డ 25 లక్షల భారతీయ కార్మికులు

సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులు తరతరాలుగా మగ్గిపోతున్న బానిసత్వం నుంచి బయటపడనున్నారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులకు ఇది ఊరటనివ్వనుంది. 

New Update
kafala

ఎన్నో ఏళ్ళుగా బానిసత్వంలో మగ్గిపోతున్న బారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. సౌదీ అరేబియాలో మగ్గిపోతున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ దేశంలో ఉన్న కఫాలా వ్యవస్థ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో దాదాపు 1.3 కోట్ల వలసదారులకు భారీ ఊరట లభించింది. ఇందులో భారతీయులే 25లక్షల వరకు ఉంటారు. సౌదీలో కఫాలా స్పాన్సర్ షిప్ వ్యవస్థను 1950లో ప్రారంభించారు. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన విదేశీ కార్మికుల ప్రవాహాన్ని నిర్వహణ కోసం దీనిని రూపొందించారు. సౌదీకు ఎవరు ఉపాధి కోసం వెళ్ళినా వారు ఈ కఫాలా వ్యవ్థతో ముడిపడి ఉంటారు. దీని గురించే తెలిసే కార్మికులు అక్కడికి వెళతారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదా అంతా ఈ కఫాలా వ్యవస్థదారుల చేతిలోనే ఉంటుంది. 

బానిసత్వం నుంచి స్వేచ్ఛ.. 

సౌదీలో పని చేసేవారు అక్కడికి వెళ్ళగానే తమ పాస్‌పోర్ట్‌ను యజమానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ తరువాత సదరు కార్మికుడు ఉద్యోగం మారాలన్నా, దేశం విడిచి వెళ్ళాలన్నా యజమాని అనుతి ఇవ్వాల్సిందే ఇదంతా కూడా కఫాలా వ్యస్ కిందకే వస్తుంది. దీని కారణంగా సౌదీలో ఎంతో చిక్కుకుని బాధలు పడిన వారు ఉన్నారు. దీనిపై మానవ హక్కుల సంఘాలు తరుూ విమర్శలు గుప్పిస్తూ ఉండేవి. స్పాన్సర్‌షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు మానవ అక్రమరవాణాకు ప్రోత్సహిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ సహా పలు ప్రపంచ సంస్థలు ఆరోపణలు చేశాయి. ఇప్పుడు కఫాలా వ్యవస్థను రద్దు చేయడంతో క్కడ కార్మికులకు స్వాంత్ర్యం లభించినట్టయింది. ఇ్పటికే దీన్ని ఇజ్రాయెల్, బహ్రెయిన్ లు రద్దు చేశాయి.  కానీ, కువైట్, ఒమన్, లెబనాన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతోంది. ఈ దేశాల్లోని దాదాపు 2.5 కోట్ల మంది మంది విదేశీ కార్మికులు కఫాలా వ్యవస్థ కింద పనిచేస్తుండగా.. వీరిలో 75 లక్షల మంది భారతీయులే.

Also Read: 2nd One Day: ఆడిలైడ్‌లో అయినా గెలుస్తారా..రికార్డును నిలబెట్టుకుంటారా?

Advertisment
తాజా కథనాలు