Asim Munir: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
పహల్గాం దాడితో భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యతగా లేదు. దేశంలో అంతర్గత ఉద్రిక్తలతో పాటు పొరుగుదేశాలతో ఉన్న విభేధాల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
భారత్‌తో ఉద్రిక్తత పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచిఉంది. ఆఫ్గనిస్తాన్‌లో కలవాలని తాలిబన్లు, బలుచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఏర్పాటు వాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి ఉంది.