VISHWAMBHARA: మెగా కంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'విశ్వంభర' అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు. షూటింగ్ చివరి షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలిపారు. అంతేకాదు ఈ షెడ్యూల్ లో బాస్ ఫ్యాన్స్ కి కిక్కెకించే ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలియజేస్తూ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో లేడీ డాన్సర్స్ అంతా కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తుండగా.. కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్, డైరెక్టర్ వశిష్ఠ మానిటర్ లో చూస్తూ ఉన్నారు. మెగాస్టార్ బ్యాక్ సైడ్ లుక్ లో స్టైలిష్ గా కనిపించారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Freezing this moment to celebrate later ❤️
— Vassishta (@DirVassishta) July 25, 2025
A Dance Storm that'll make you BOSS-fied Shuruuuu 💥 🤙#Vishwambhara - Last Schedule begins! pic.twitter.com/rlAi8KQLfM
మౌనిరాయ్..
అయితే 'విశ్వంభర' లో ఒక స్పెషల్ నెంబర్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించారు. ఇప్పుడు ఈ ఫొటోలతో అది నిజమేనని అర్థమవుతోంది. ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ మెగాస్టార్ జోడీగా స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. మౌని రాయ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, ఆమెకున్న క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో వీఎఫెక్స్ ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు రావడంతో.. నిర్మాతలు వీఎఫెక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. దీని కారణంగానే విడుదల కూడా ఆలస్యమవుతూ వస్తుందని టాక్.
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్ పై కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి 'విశ్వంభర' ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.