IND-CHINA WAR: భారత్ పై చైనా భారీ కుట్ర.. ఓ వైపు భారీ డ్యామ్.. మరో వైపు వార్ బేస్ నిర్మాణం!

భారత్ తో చైనా యుద్ధానికి సిద్ధం అవుతోందా అంటే అవుననే అంటున్నారు. రెండు దేశాలకు సరిహద్దులో ఉన్న పాంగాంగ్ లేక్ దగ్గరలో చైనా సైనిక స్థావరాలను నిర్మించడం, బ్రహ్మపుత్రపై మెగా డ్యామ్ దీనికి సంకేతాలని చెబుతున్నారు. 

New Update
China Dam

పైకి ఏమీ తెలియనట్టు నాటకాలాడుతోంది చైనా. భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవడమే తమ లక్ష్యమని చెబుతోంది. కానీ వెనుక మాత్రం ఇండియాతో యుద్ధానికి సిద్ధమౌతోంది. భవిష్యత్తులో పెద్ద వార్ కు ప్రణాళికలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ ను రెండు వైపులా చుట్టుముట్టేందుకు ప్లాన్ వేసింది చైనా. అందుకు నిదర్శనమే లడక్ లో ఉన్న పాంగాంగ్ లేక్ దగ్గరలో సైనిక స్థావాలను నిర్మించడం, బ్రహ్మాపుత్రినదిపై మెగా డ్యామ్ నిర్మాణ్ అని చెబుతున్నారు. ఒకటి సైనిక ఒత్తిడి అయితే మరొకటి వ్యూహాత్మక నీటి నియంత్రణ అని అంటున్నారు. 

పాంగాంగ్ లేక్ దగ్గరలో సైనిక స్థావరం..

ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSNIT) ప్రకారం, పాంగాంగ్ లేక్ తూర్పు తీరంలో చైనా ఒక పెద్ద సైనిక సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇది దాదాపు పూర్తయిందని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేశాయి. ఇందులో చైనా లోతైన గ్యారేజీలను నిర్మించింది. ఇక్కడ సాయుధ వాహనాలు, క్షిపణి ట్రక్కులను దాచవచ్చు. దీనితో పాటు హైవే లాంటి నిర్మాణం కూడా ఉంది అక్కడ. దీనిని లాంచింగ్ ప్లాట్‌ఫామ్‌గా లేదా రాడార్‌గా ఉపయోగించవచ్చని అంచనా. ఈ సైనిక నిర్మాణం రాడార్ సైట్ సమీపంలో ఉందని.. అందువల్ల క్షిపణి వ్యవస్థ లేదా ఇతర ఆయుధాల కోసం ఉపయోగించవచ్చని OSNIT చెబుతోంది. భారత్ మీద విమాన దాడికి చైనా ఇక్కడ నుంచి ప్లాన్ చేయొచ్చని అంటోంది. ఇక్కడ కనుక డ్రాగన్ కంట్రీ నిఘా సామర్థాన్ని అభివృద్ధి చేస్తే ఇండియా వైమానికదళం రహస్యాలన్నీ ఈజీగా తెలుసుకోగలుగుతుంది. 

బ్రహ్మపుత్రానదిపై వాటర్ బాంబ్..

ఇక బ్రహ్మపుత్రినదిపై చైనా మెగా ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రాజెక్టు భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్పోగా పిలువబడే బ్రహ్మపుత్ర నది, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంల గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి వెళుతుంది. చైనా ఈ ఆనకట్టతో నదీ ప్రవాహాన్ని నియంత్రించగలదు. వర్షాకాలంలో నదికి భారీ వరదలు వచ్చినప్పుడు, చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న భారత ప్రాంతాలు, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ బెల్ట్, అస్సాం తీవ్రంగా ముంపునకు గురవుతాయి. దీనివల్ల లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఈ ఆనకట్ట వల్ల సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది. 

డబుల్ ప్రమాదం..

దీనిబట్టి చైనా రెండు విధాలుగా భారత్ ను చుట్టుముట్టడానికి సిద్ధమౌతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రెండు వ్యూహాలు భారతదేశానికి భౌగోళిక, రాజకీయ, వ్యూహాత్మక స్థానానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించనున్నాయి. 

Also Read: Yash Dayal: మైనర్ పై అత్యాచారం..ఆర్సీబీ ప్లేయర్ యశ్ దయాళ్ పై మరో కేసు

Advertisment
తాజా కథనాలు