Bank Holidays: ఇది కదా అసలైన పండుగంటే.. అక్టోబర్‌లో ఏకంగా 19 రోజులు బ్యాంకులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

దేశవ్యాప్తంగా అక్టోబర్‌ నెలలో వివిధ బ్యాంకులకు 19 రోజులు సెలవులు ఉన్నాయి. పండుగలు, జాతీయ దినోత్సవాలు, ప్రాంతీయంగా ఉన్న పండుగల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులను ప్రకటించింది. 

New Update
Bank Holidays

Bank Holidays

దేశవ్యాప్తంగా అక్టోబర్‌ నెలలో వివిధ బ్యాంకులకు 19 రోజులు సెలవులు ఉన్నాయి. పండుగలు, జాతీయ దినోత్సవాలు, ప్రాంతీయంగా ఉన్న పండుగల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులను ప్రకటించింది. 

అక్టోబర్ 1

దసరా, ఆయుధ పూజ. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో సెలవు.

అక్టోబర్ 2 
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

అక్టోబర్ 3 
దుర్గా పూజ సందర్భంగా సిక్కింలో సెలవు.

అక్టోబర్ 4 
దుర్గా పూజ సందర్భంగా సిక్కింలో సెలవు.

అక్టోబర్ 5
ఆదివారం సందర్భంగా సెలవు.

అక్టోబర్ 6 
లక్ష్మీపూజ సందర్భంగా త్రిపుర, వెస్ట్ బెంగాల్‌లో సెలవు.

అక్టోబర్ 7
మహర్షి వాల్మీకీ జయంతి సందర్భంగా కర్ణాటక, ఒడిశా, చంఢీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు.

అక్టోబర్ 10 
కర్వా చౌత్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు.

అక్టోబర్ 12
ఆదివారం సందర్భంగా సెలవు.

అక్టోబర్ 18
కటి బిహు సందర్భంగా అస్సాంలో సెలవు.

అక్టోబర్ 19
ఆదివారం సందర్భంగా సెలవు.

అక్టోబర్ 20 
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సెలవు.

అక్టోబర్ 21 
దీపావళి, గోవర్థన్ పూజను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్ము, శ్రీనగర్‌లలో చేస్తారు. ఈ క్రమంలో సెలవు ప్రకటించారు. 

అక్టోబర్ 22  
దీపావళి, విక్రమ సంవత్సరం సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలో సెలవు.

అక్టోబర్ 23 
భైదూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా గుజరాత్, సిక్కిం, మణిపూర్, యూపీ, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో సెలవు.

అక్టోబర్ 26
ఆదివారం సందర్భంగా సెలవు.

అక్టోబర్ 27 
చత్ పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్‌లలో సెలవు.

అక్టోబర్ 28 
చత్ పూజ సందర్భంగా బిహార్, ఝార్ఖండ్‌లలో సెలవు.

అక్టోబర్ 31 
సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లో సెలవు.

Advertisment
తాజా కథనాలు