Tech Layoffs: ఆ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్.. బలవంతంగా రిజైన్.. ఒక్కసారిగా 80 వేల మందిపై వేటు!

ఇటీవల టీసీఎస్ కంపెనీ 2 శాతం ఉద్యోగులను ఇటీవల తొలగించింది. అంటే దాదాపుగా 12 వేల ఉద్యోగులను తొలగించినట్లు టీసీఎస్ అధికారికంగా ప్రకటించింది. కానీ కంపెనీలో దాదాపుగా 80 వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది.

New Update
layoffs

layoffs

ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగం వస్తే చాలు.. లైఫ్ సెట్ అయినట్లే అని ఉద్యోగులు ఫీల్ అవుతుంటారు. టీసీఎస్‌లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగంతో ఈక్వెల్ అని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో టెక్ కంపెనీలు ఐటీ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. పెద్ద కంపెనీలతో పాటు చిన్న టెక్ కంపెనీలు కూడా ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయి. అయితే టీసీఎస్ కంపెనీ 2 శాతం ఉద్యోగులను ఇటీవల తొలగించింది. అంటే దాదాపుగా 12 వేల ఉద్యోగులను తొలగించినట్లు టీసీఎస్ అధికారికంగా ప్రకటించింది. కానీ కంపెనీలో దాదాపుగా 80 వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ మాత్రం బయటకు 12 వేల మందికి తొలగించినట్లు చెబుతుందని మాజీ ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Google: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. గూగుల్ గ్రీన్ సిగ్నల్.. త్వరలో 25 వేల ఉద్యోగాలు!

బలవంతంగా రాజీనామా చేయిస్తున్న టీసీఎస్..

మరికొందరిని బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ఓ సీనియర్ ఉద్యోగిని రిటైర్మెంట్ తీసుకోమని టీసీఎస్ హెచ్‌ఆర్‌లు బలవంతం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా లేఫ్‌లు ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో విడతలుగా ఉద్యోగులను తొలగించింది. టీసీఎస్‌తో పాటు, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు తొలగించాయి. ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏఐ వచ్చినప్పటి నుంచి కంపెనీ తన ఉద్యోగులను తొలగిస్తోంది. ఉద్యోగులు చేయాల్సిన పనిని ఏఐ చేస్తోంది.దీంతో కంపెనీలు ఉద్యోగులు తొలగిస్తున్నాయి. దీనివల్ల కంపెనీ ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నాయి. అయితే మరో విడతలో కూడా ఈ ఏడాది ఉద్యోగులను తొలగించనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి మున్ముందు ఇంకా ఎంత మందిని తొలగిస్తారో చూడాలి. 

ఇది కూడా చూడండి: Microsoft: ఉద్యోగులకు Microsoft బిగ్ షాక్.. అలా చేస్తే మీ ఉద్యోగం ఔట్!

Advertisment
తాజా కథనాలు