Philippiens: ఫిలిప్పీన్స్ లో పెరుగుతున్న భూకంపం డెత్ టోల్..31 చేరుకున్న మృతుల సంఖ్య

సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో నిన్న రాత్రి 6.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీని కారణంగా ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చునని చెబుతున్నారు.

New Update
philippiens

మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్ లో భూమి ఒక్కసారిగా దద్ధరిల్లింది. రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రతతో అక్కడ భూకంపం వచ్చింది. సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని కారణంగా ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. మరో 150 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది ఈ సంఖ్య మరింత పెరగవచ్చని రెస్క్యూ అధికారులు చెబుతున్నారు. ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ కొంతమంది మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

సునామీ హెచ్చరిక...

శాన్‌ రెమిజియో పట్టణంలో ముగ్గురు కోస్ట్‌గార్డ్‌ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మరో ఆరుగురు మరణించినట్లు వైస్‌ మేయర్‌ ఆల్ఫీ రేనెస్‌ తెలిపారు. బోగో సిటీలో ఇళ్ళు, రోడ్లు దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా సముద్రంలో సునామీ రావొచ్చునని..తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లేటె, సెబు, బిలిరాన్‌ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

పాక్షికంగా కూలిన పురాతన చర్చి..

ఇక భూకంపం కారణంగా పిలిప్పీన్స్ లోని అతి పురాతన చర్చి అయిన సెయింట్ పీటర్ ది అపోస్టల్ సాక్షికంగా కూలిపోయింది. దీంతో పాటూ అక్కడ చాలా భవనాలు కూలిపోయాయని అధికారులు చెబుతున్నారు. బాంటాన ద్వీపంలో భూకంప ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ ఇళ్ళు, స్కూళ్ళు, ఆసుపత్రులు కూడా కూలిపయాయి. వాటి కింద చాలా మంది ప్రజలు ఉండవచ్చునని రెస్క్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు