/rtv/media/media_files/2025/08/02/pakistan-bangladesh-air-force-deal-2025-08-02-18-52-51.jpg)
Pakistan-Bangladesh Air Force Deal
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య రహస్యంగా జరిగిన ఓ వైమానిక ఒప్పందంపై నిఘా వర్గాలకు చెందిన రిపోర్ట్ లీకైయింది. ఈ ఒప్పందం ప్రకారం.. పాక్ తన వద్ద ఉన్న డ్రోన్ వార్‌ఫేక్ టెక్నాలజీని బంగ్లాదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు ఆ నివేదికలో ఉంది. అయితే ఈ రహస్య ఒప్పందం వల్ల భారత్‌కు ముఖ్యంగా తూర్పు సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో భద్రతాపరంగా సవాళ్లు సృష్టించే ఛాన్స్ ఉందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై భారత్ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది.
Pakistan-Bangladesh Air Force Deal
బంగ్లాదేశ్, పాకిస్థాన్ సైనిక సంబంధాలను నిశితంగా గమనిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను, రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు.. అలాగే ఆయుధ సంపత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ రిపోర్టు ప్రకారం చూసుకుంటే పాకిస్థాన్ , బంగ్లాదేశ్ వైమానిక దళాల చీఫ్‌లు ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రహస్యంగా చర్చలు జరిపి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే చైనా సాయంతో పాకిస్థాన్ ఈ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. స్ట్రాటజిక్ కమ్యూనికేషన్లు, స్పేస్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అలాగే ప్రపంచ రాజకీయ పరిస్థితులపై వైమానిక దళాల చీఫ్‌లు చర్చించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా బంగ్లాదేశ్.. ప్రత్యేక ఆయుధాలను పారా కమాండో బెటాలియన్‌కు పంపించడం, పాకిస్థాన్ బంగ్లా దళాలకు సైనిక శిక్షణ ఇవ్వడం, పాక్ నుంచి స్వల్ప శ్రేణి మిసైల్స్‌ను కొనుగోలు చేయడం, టర్కీ నుంచి కూడా బంగ్లాదేశ్ యుద్ధ ట్యాంకులు కొనుగోలు చేయడంపై ఇరుదేశాలు ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. అలాగే ఈ చర్చల్లో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్‌ను పదవీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
Also Read : ఆ పిండం వయసు 30 ఏళ్లు..
బంగ్లా, పాక్ రహస్య ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో భారత్ అలెర్ట్ అయ్యింది. భారత్‌కు తూర్పు సరిహద్దుల్లో బంగ్లాదేశ్, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. ఇరుదేశాలు కూటమిగా ఏర్పడితే భారత్ సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు డ్రోన్ టెక్నాలజీ అందిస్తే భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే ఛాన్స్ ఉంటుందని భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉండగా ఇటీవల బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాక్‌తో మరింత సంబంధాలు పెంచుకుంటోంది.
Also Read : 'వారానికి 80 గంటలు పనిచేయాలి'.. మరో వ్యాపారవేత్త కీలక ప్రకటన
rtv-news | telugu-news | latest-telugu-news | international news in telugu | national news in Telugu | breaking news in telugu