/rtv/media/media_files/2025/08/02/indian-entrepreneur-2025-08-02-19-39-32.jpg)
Indian Entrepreneur's 80-Hour Workweek Claim Reignites Productivity Debate
ఇటీవల ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి.. భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై చాలామంది తీవ్రంగా విమర్శలు చేశారు. మరికొందరు ఆయనకు మద్దతిచ్చారు. ఆ తర్వాత ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్ వారానికి ఏకంగా 90 గంటలు పనిచేయాలని అన్నారు. దీంతో ఈయన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాజాగా వీళ్లకు మద్దతుగా మరో భారతీయ యువ వ్యాపారవేత్త నేహా సురేశ్ నిలిచారు. ఈమె అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ ఏఐ సంస్థను స్థాపించారు.
అలా చేయకుంటే మీ కలను సాధించలేరు
ఆమె, తన కోఫౌండర్ ఆకాశ్ కలిసి పనిచేస్తున్న వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ చిన్నపాటి గదిలో నేహా, ఆకాశ్ పక్కపక్కనే వేరు వేరు డెస్కుల్లో కూర్చొని ఎలా పనిచేస్తున్నారో చూపించారు. వాళ్లిద్దరూ తమ పనిలో మునిగిపోయినట్లు, మధ్యమధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకున్నట్లు కనిపించింది.'' మీ డ్రీమ్‌ను సాకారం చేసుకునేందుకు రోజుకు 14 గంటలకు పైగా వెచ్చించకపోతే దాన్ని సాధించలేరు. 9-5 పని గంటల శక్తితో ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తిని తయారుచేయలేరు. వారానికి 8-0 గంటలు పనిచేయడం అనేది తీవ్రమైన విషయమేమి కాదు. ఇది కనీస స్థాయి వర్కింగ్ అవర్స్ అంటూ'' నేహా సురేశ్ రాసుకొచ్చారు.
If you're not spending 14+ hours a day working on your dream you're ngmi.
— Neha (@Neha_Suresh_M) July 31, 2025
You can’t build a world-changing product on 9–5 energy.
80-hour weeks aren’t extreme. It's baseline. pic.twitter.com/6lTxrqUxJZ
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. కొందరు ఆమెను విమర్శిస్తుంటే మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆమె లాంటి లైఫ్‌స్టైల్ అందిరికీ ఉంటుందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచాన్ని మార్చగలిగే ఉత్పత్తులను కేవలం 80, 90 పని గంటలతో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా తయారుచేయవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉండగా గతంలో నారాయణమూర్తి ఇలాంటి వాదనే చేశారు. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో ప్రొడక్టివిటీ తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే యువత మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఇలానే కష్టపడ్డాయని.. మనం కూడా అలాగే పనిచేయాలని పేర్కొన్నారు.
Also Read: బరితెగించింది.. భర్తను బతికుండగానే పాతిపెట్టాలని చూసింది... డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!
ఆ తర్వాత ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యం కూడా యువత వారానికి 90 గంటలు పనిచేయాలని వాదించారు. అంతేకాదు ఆదివారం సెలవును కూడా వదిలేయాలని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ఎక్కువ గంటలు పని చేయాలని అన్నారు. ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇలా చేయడం వల్ల వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ ఉండదని అన్నారు. కుటుంబంతో సంతోషంగా గడపలేమని చెప్పారు. అంతేకాదు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలనే వాదనపై అప్పట్లో ఓ సంస్థ సర్వే కూడా నిర్వహించింది. ఇందులో 78 శాతం మంది ఉద్యోగులు తమ కుటంబమే మొదటి ప్రాధాన్యమని.. ఆ తర్వాతే పని అని చెప్పారు.