Operation Sindoor: కాల్పుల విరమణకు భారత్‌ థర్డ్‌ పార్టీని తిరస్కరించింది.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన

తాజాగా పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి ఇషాఖ్ దార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌.. ఎలాంటి థర్డ్‌ పార్టీని అంగీకరించలేదని స్పష్టం చేశారు. 

New Update
Pakistan admits India rejected third party intervention during Operation Sindoor

Pakistan admits India rejected third party intervention during Operation Sindoor

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam attack) తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌(operation Sindoor) పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇరుదేశాల మధ్య యద్ధం జరిగింది. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. అయితే భారత్‌, పాక్‌ మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని ఇటీవల ట్రంప్ పదేపదే చెప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ భారత్‌ మాత్రం దీన్ని ఖండించింది. ఇందులో ట్రంప్ జోక్యం లేదని స్పష్టం చేసింది. తాజాగా పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి ఇషాఖ్ దార్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌.. ఎలాంటి థర్డ్‌ పార్టీని అంగీకరించలేదని స్పష్టం చేశారు. 

Also Read :  గాజాలో మారణహోమం.. టార్గెట్‌ నెరవేరేవరకు వదలమంటున్న ఇజ్రాయెల్

Pakistan Admits India Rejected Third Party Intervention

పాకిస్థాన్‌తో ఉన్న అన్ని సమస్యలపై భారత్‌ కఠినంగా ద్వైపాక్షిపూరితంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ జోక్యానికి మేము అభ్యంతరం చెప్పమని.. కానీ భారత్‌ మాత్రం ద్వైపాక్షిక విధానాన్ని ఎంచుకుందని తెలిపారు. ''మేలో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. ఆ తర్వాత భారత్‌-పాకిస్థాన్(2025 india pakistan war) మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కరించేదుకు తటస్థ వేదికపై చర్చలు జరుగుతాయని చెప్పింది. కానీ వాషింగ్టన్‌లో జులై 25 యూఎస్‌ సెక్రటరీ రూబియోతో సమావేశంలో భారత్‌ ఈ ప్రతిపాదనకు నిరాకరించింది.  భారత్‌ ఇది ద్వైపాక్షిక సమస్య అని చెప్పింది. మేము ఎవరినీ అడుక్కోవడం లేదని తెలిపిందని'' ఇషాఖ్ దార్‌ అన్నారు. 

Also Read :  ఖతార్ లో ఇజ్రాయెల్ దాడిపై ఇస్లాం దేశాల సీరియస్.. రక్త దాహాన్ని అడ్డుకోవాలని తీర్మానం

Advertisment
తాజా కథనాలు