Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

పాక్‌ లో రైలు హైజాక్‌ ఘటనలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్‌ షరీఫ్‌ తెలిపారు.అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు.

New Update
hijack

Baloch Liberation Army Hijacked Train

పాకిస్థాన్‌ లో రైలు హైజాక్‌ అయిన ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతిచెందినట్లు పాక్‌ ఆర్మీ జనరల్‌ పేర్కొన్నారు. పాక్ భదత్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని ఆర్మీ అధికార ప్రతినిధి ,లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ తెలిపారు.రైలులో ఉన్న అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు.

Also Read: Business: స్టాక్ మార్కెట్ క్రాష్..ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లు లాస్

మిగిలిన ప్రయాణికులను కాపాడామని వెల్లడించారు. బలోచిస్థాన్‌ ప్రావిన్సులోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌ కు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళ్తున్న బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ మిలిటెంట్లు రైలును హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే.

Also Read:Haryana Municipal elections: హర్యానాలో వికసించిన కమలం.. 9 కార్పొరేషన్లు కైవసం!

ఘటన జరిగిన సమయంలో 9 కోచ్‌ లలో మొత్తం 440 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బీఎల్‌ఏ మిలిటెంట్లు ప్రకటించారు.దీంతో రంగంలోకి దిగిన బలగాలు విజయవంతంగా రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నాయి.రైలు హైజాక్‌ ఘటనకు సంబంధించి లెఫ్టినెంట్‌ జనరల్‌ షరీఫ్‌ ఓ టీవీ ఛానెల్‌ తో మాట్లాడారు. మార్చి 11న మధ్యాహ్నం 1 గంట సమయంలో బలోచ్ మిలిటెంట్లు రైల్వే ట్రాక్‌ పేల్చేసి రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతామంతా కష్టతరమైన భూభాగం.

మిలిటెంట్లు ప్రయాణికులను రక్షణ కవాచాలుగా ఉంచుకోవడంతో ఈ ఆపరేషన్‌ ముగించడానికి సమయం పట్టింది. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్యాసింజర్లను సురక్షితంగా కాపాడాం. ఇక బుధవారం మిగిలిన మొత్తం ప్రయాణికులను కాపాడాం. ఈ ఆపరేషన్‌ అత్యంత కచ్చితత్వంతో పాటు జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది.

ఆత్మాహుతి బాంబర్లను మొదట స్నిపర్స్‌ చంపేశారు. అనంతరం ఒక్కో కంపార్ట్‌మెంట్‌ లోని టెర్రరిస్టులను హతమారుస్తూ వచ్చాం. తమ ఆపరేషన్‌ సమయంలో ప్రయాణికులకు ఎవరికీ ఏం జరగలేదు. ప్రస్తుతం ఘటన ప్రాంతంలో మిలిటెంట్లు ఎవరూ బతికిలేరు.అయితే బాంబు నిర్వీర్య దళం రైలును చెక్‌ చేస్తోంది. తమ ఆపరేషన్‌ కొనసాగుతున్న సమయంలో పారిపోయిన ప్రయాణికులను ఒక్కదగ్గరికి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మిలిటెంట్లు , వారికి సహాయం చేసేవారు ఎక్కడున్నా వదిలేదు లేదు. పాకిస్థానీయునలు లక్ష్యంగా చేసుకునే ఏ విదేశీ శక్తుల ఆటలు సాగనివ్వం అని పేర్కొన్నారు. రైలు హైజాక్‌ ఘటన తమ భద్రత పరిస్థితినే పూర్తిగా మార్చివేసిందని షరీఫ్‌ తెలిపారు.

Also Read:QS World Rankings: క్యూఎస్‌ వరల్డ్ ర్యాంకింగ్స్‌ జాబితా విడుదల.. టాప్‌ యూనివర్సిటీలు ఏవంటే ?

Also Read: National: 350 ఏళ్ల పోరాటం.. దళితులకు ఆ గుడిలో పూజలు చేసుకునేందుకు అనుమతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు