/rtv/media/media_files/2025/03/12/mJbRfnQdIo6kU7nerlyW.jpg)
West Bengal Dalit families allowed temple after 350 years
National: ఎట్టకేలకు 350 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. దళిత సమాజానికి గిద్దేశ్వర్ శివాలయంలో పూజలు చేసుకునే హక్కు లభించింది. పశ్చిమ బెంగాల్ దాస్పాడకు చెందిన 130 కుటుంబాలకు గ్రామంలో సామాజిక వివక్షత కారణంగా ఆలయంలో పూజలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత 350 ఏళ్లుగా వారు ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డారు. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిణామాలు, పాలకుల జోక్యంతో ఉద్రిక్త పరిస్థితులనడుమ గిద్దేశ్వర్ ఆలయంలో గ్రామస్థులందరికీ పూజలు చేసుకునే సమాన హక్కులు ఉంటాయని నిర్ణయించారు. అంతేకాదు మార్చి 12న దళిత సమాజానికి చెందిన ప్రజలు ఆలయంలో పూజలు చేసి పాత సంప్రదాయానికి ముగింపు పలికారు.
130 కుటుంబాల నిరసన..
ఈ మేరకు దాస్పాడ గ్రామానికి చెందిన 130 కుటుంబాలకు సామాజిక వివక్షత కారణంగా ఆ ఊరి ఆలయంలో పూజలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ సంవత్సరం శివరాత్రి నాడు ఆలయంలో పూజలు చేయాలనే తమ కోరికను గ్రామ పెద్దలముందు వ్యక్తం చేశారు. దీంతో అగ్ర కులస్థులు నిరసన వ్యక్తం చేసి వారిని భయాందోళనకు గురిచేశారు. దీంతో దళితులంగా నిరసనకు దిగారు. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే ఆ 130 కుటుంబాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు SDO, BDO పోలీసులు జోక్యం చేసుకుని మార్చి 7న కొంతమందిని ఆలయానికి తీసుకెళ్లారు. గ్రామంలో ఘర్షణ, ఉద్రిక్తత నెలకొనగా ప్రభుత్వం కలగజేసుకుని మార్చి 11న జరిగిన పరిపాలనా సమావేశంలో అందరికీ పూజా హక్కు సమానంగా ఉంటుందని నిర్ణయించింది.
Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
రాజ్యాంగం కల్పించిన హక్కు..
ఈ మేరకు మార్చి 12న పోలీసు బలగాల సమక్షంలో దాస్ వర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆలయంలో గంట మోగించి, పూలు, పండ్లు సమర్పించి శివుడిని పూజించారు. ఆలయ కమిటీ, గ్రామస్తులలో ఒక వర్గం ఈ సంప్రదాయాన్ని మార్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను ఇస్తుందని పరిపాలన స్పష్టం చేసింది. ఇప్పుడు అన్ని కులాల ప్రజలు గిద్దేశ్వర్ ఆలయంలో పూజలు చేసుకోగలరు అంటూ ప్రకటించారు.
Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్...ఆ పనిచేయాలని ఆదేశం
చారిత్రాత్మక దినం..
దాస్ కమ్యూనిటీ ప్రజలు దీనిని తమకు చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. ఇప్పుడు తాము కూడా శివుడిని గౌరవంగా పూజించవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా స్థానిక ప్రభుత్వం ఆలయం వెలుపల పోలీసులను మోహరించింది.