/rtv/media/media_files/2025/03/12/JX6sUatq3MGVBqINoO6F.jpg)
QS University Rankings List Released
ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు సంబంధించి క్యూఎస్ ర్యాంకులు 2025 రిలీజ్ అయ్యింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే టాప్ 50 జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అయితే ఈసారి ఐఐటీ ఢిల్లీ 47వ ర్యాంకులో నిలవగా.. ఐఐటీ బాంబే 50వ స్థానంలో ఉంది. గతేడాది ఐఐటీ ఢిల్లీకి 45వ స్థానం రాగా.. ఈసారి 47కి చేరింది.
Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్...ఆ పనిచేయాలని ఆదేశం
అయితే ప్రపంచంలోని మొత్తం 550 యూనివర్సిటీలకు సంబంధించి క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితా విడుదలైంది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానం సంపాదించింది. ఇక స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ రెండో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మూడో స్థానంలో నిలిచాయి. మొదటి మూడు ర్యాంకులు కూడా అమెరికాలో ఉన్న యూనివర్సిటీలే దక్కించుకోవడం విశేషం.
క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్‌కు చెందిన పలు యూనివర్సిటీల ర్యాంకులను చూస్తే.. ఐఐటీ ఢిల్లీకి 47వ స్థానం వచ్చింది. అలాగే ఐఐటీ బాంబే (50), ఐఐటీ ఖరగ్‌పుర్ (78), ఐఐటీ మద్రాస్ (84), ఐఐటీ కాన్పుర్ (92), ఐఐఎస్‌సీ - బెంగళూరు (136)వ స్థానాల్లో నిలిచాయి
అలాగే 151 నుంచి 200 మధ్య ర్యాంకుల్లో అన్నా యూనివర్సిటీ చెన్నై, ఐఐటీ గువాహటి, ఐఐటీ రూర్కీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థానాలు సంపాదించాయి.
Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
ఇక బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) పిలానీకి 251 -నుంచి -300 మధ్య ర్యాంకుల్లో నిలిచింది. 301 నుంచి -350 మధ్య ర్యాంకుల్లో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చోటు సంపాందించింది. ఇక 401 నుంచి -450 మధ్య ర్యాంకుల్లో చూస్తే చండీగఢ్ యూనివర్సిటీకి చోటు దక్కింది.