Train Hijack: రైలు హైజాక్ వెనుక భారత్ హస్తం.. పాక్ ఆరోపణలు
భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. ఇటీవల బలూచిస్తాన్‌లో రైలు హైజాక్ అయిన సంఘటన వెనుక భారత్ హస్తం ఉందని తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసింది.
భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. ఇటీవల బలూచిస్తాన్‌లో రైలు హైజాక్ అయిన సంఘటన వెనుక భారత్ హస్తం ఉందని తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసింది.
పాక్ లో రైలు హైజాక్ ఘటనలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ తెలిపారు.అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వేర్పాటువాదుల నుంచి పాక్ భద్రతా బలగాలు ఇప్పటివరకు 190 మందిని రక్షించాయి. అయితే మరో 200 మందిని ఐదు వేరు వేరు ప్రాంతాల్లో మిలిటెంట్లు బంధించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ రైలును హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఈ ఘటనపై విచిత్ర వాదన చేస్తోంది. ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. ట్రైన్ హైజాక్‌కు భారత్ సహరించిందంటూ ఆరోపించారు.