Sudan Tragedy: సూడాన్ లో విరిగిపడిన కొండచరియలు..1000 మంది మృతి

ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు. 

New Update
Sudan landslide

Sudan landslide

నిన్న ఆఫ్ఘనిస్థాన్ భూకంపం(Afghanistan Earthquake) ధాటికి దాదాపు 800 మంది చనిపోయారు. చాలా మంది గల్లంతయ్యారు. ఈ ప్రకృతి విపత్తే చాలా బాధాకరంగా ఉంటే...అటు ఆఫ్రికాలో మరో ఘోర విపత్తు చోటు చేసుకుంది. సూడాన్ లో మర్రా పర్వత ప్రాంతంలో కొండ చరియలు(landslides) విరిగి పడి ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రజలు మృతి చెందారు. కొన్ని రోజుల తరబడి వర్షాలు పడుతుండడంతో మర్రా కొండ చరియలు విరిగి పడ్డాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం గ్రామంలో ఒక్కరే బ్రతికి బయటపడ్డారు. 

Also Read :  పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

నిరాశ్రయులపై విరిగిపడిన కొండచరియలు..

మామూలుగానే సూడాన్(Sudan) పరిస్థితులు ఏమీ బాలేవు. అక్కడ సూడాన్ సైన్యం, పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. కొండ చరియలు విరిగి పడి చనిపోయిన వారందరూ ఆ ఘర్షణల నుంచి తప్పించుకుని వచ్చినవారు, నిరాశ్రయులు. మర్రా కొండల మీద నుంచి పెద్ద పెద్ద రాళ్లు వచ్చి పడడంతో వాటి కింద ఇళ్ళు, కుటుంబాలు నేల మట్టం అయిపోయాయి. మృతదేహాలను వెలికితీయడంలో సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ మానవతా సంస్థలకు సూడాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.  చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. 

సూడాన్ లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొంది. దానికి తోడు ప్రకృతి కూడా వారి మీద పగబట్టింది. సూడాన్ సాయుధ దళాలు,  పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా అక్కడ జనాలు పారిపోయి మర్రా పర్వతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. రెండేళ్ళుగా జరుగుతున్న ఈ యుద్ధం లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది.  చాలా మంది అక్కడ ఆకలితో నకనకలాడుతున్నారు. దానికి తోడు వైద్య సౌకర్యాలు కూడా సరిగ్గా లేక చనిపోతున్నారు. 

Also Read :  అయ్యో ట్రంప్ కు ఏమైంది..ఇలా మారిపోయారేంటీ..కలకలం సృష్టిస్తున్న లేటెస్ట్ పిక్స్..

Advertisment
తాజా కథనాలు