/rtv/media/media_files/2025/09/02/trump-pics-2025-09-02-07-54-20.jpg)
Trump Latest Pics
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం(trump health) మీద కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం అవుతోంది. దానికి తోడు ఆయన తాజా ఫొటోలు సంచలనంగా మారాయి. వైట్ హౌస్ నుంచి బయటకు వస్తుండగా తీసిన పిక్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ట్రంప్ వాటిల్లో చాలా మారిపోయి కనిపించారు. దీంతో మళ్ళీ ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నారు.
Also Read : ఎంప్లాయితో సంబంధం.. నెస్లే సీఈఓ పై వేటు
అయ్యో ఇలా మారిపోయారేంటీ...
ప్రస్తుతం ట్రంప్ ను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేరని చెబుతున్నారు. ఆయన తల మీద జుట్టు దాదాపుగా ఊడిపోయిందని... బట్టతల క్లియర్ గా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ఆయన చేతి మీద ఉన్న నల్ల మచ్చ మరింత పెద్దదిగా కూడా కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అసలే ట్రంప్(Donald Trump) చాలా రోజులుగా కనిపించడం లేదని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ అవుతున్నాయి. ఆయనకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని..ఆయన మరణించారని కూడా కొంత మంది పుకార్లు సృష్టించారు. ఇప్పుడు బయటకు వచ్చిన పిక్స్ చూసి కచ్చితంగా ట్రంప్ కు ఏదో అయిందని అంటున్నారు. కానీ ఇంత తొందరగా ఆయనలో మార్పు ఎలా వచ్చిందని...రెండు రోజుల్లోనే అంతలా ఎలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరుగుతోందో చెప్పాలని అడుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి వైద్య చికిత్స జరుగుతోందని...దానివల్లనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. తీవ్రమైన గుండెజబ్బు, క్యాన్సర్ లాంటి రోగాలకు చేసే చికిత్సకే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం దీని మీద ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరోవైపు ట్రంప్ కూడా ఈ పుకార్ల మీద ఏమీ మాట్లాడటం లేదు. కనీసం వాటిని ఖండించడం కూడా లేదు.
Trump leaves the White House this morning
— Aaron Rupar (@atrupar) September 1, 2025
(Andrew Caballero/Getty) pic.twitter.com/h3cG0GohXj
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం(Trump Health) పై చాలా రోజుల నుంచీ ఆందోళన వ్యక్తం అవుతోంది. బయటకు ఆయన బాగానే కనిపిస్తున్నా...తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నారని చెబుతున్నారు. దీనికి కారణం ఆయన శరీరంలో కనిపిస్తున్న లక్షణాలే అంటున్నారు. కొంత కాలం నుంచి ట్రంప్ ను గమనిస్తున్నవారు చెబుతున్నదాన్ని బట్టి ఆయన ఆరోగ్యం ఏమీ బాలేదని తెలుస్తోంది. తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని...కానీ దాన్ని ట్రంప్ కానీ, వైట్ హౌస్ కానీ బయటపెట్టడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కాలి చీలమండల వాపు గురించి, చేతి మీద ఉన్న మచ్చ గురించి ఇంతకు ముందే బయటకు వచ్చింది. ఇప్పుడు వాటితో పాటూ ఉబ్బిపోయిన కళ్లు, రంగుమారిపోయిన పెదవులు, నడిచేప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుండటం వంటి లక్షణాలను చూపిస్తున్నారు. ఇవన్నీ తీవ్రమైన గుండెజబ్బు లక్షణాలు(Heart Problem Symptoms), దానికి వాడే మందుల ప్రభావం అని చెబుతున్నారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) ను రెడ్ కార్పెట్ పై ఆహ్వానించే సమయంలో ట్రంప్ తూలుతూ నడిచిన తీరును గుర్తుచేస్తున్నారు.
Also Read: Sudan Tragedy: సూడాన్ లో విరిగిపడిన కొండచరియలు..1000 మంది మృతి