No King Protest: ట్రంప్ అధ్యక్ష పదవికి గండం? వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఆయన అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

New Update
no king

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) పై ఒక్క యూఎస్‌(US)లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈరోజు ఒక్క అమెరికాలోనే కాకుండా కెనడాతో పాటు బెర్లిన్‌, రోమ్‌, పారిస్‌, స్వీడన్‌లలోని యూఎస్‌ రాయబార కార్యాలయాల వెలుపల కూడా పెద్ద ఎత్తున జనాలు నిరసనలు వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏజెలెస్‌లతో సహా మొత్తం 50 నగరాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమవలసలని, యూనివర్శటీల్లో సీట్లు ఇవ్వకూడదని, నేషనల్ గార్డ్స్ మోహరించడం, వీసా రూల్స్‌ను మార్చేయడం, ఫెడరల్ ఉద్యోగాలను పీకేయడం లాంటి చర్యలతో ప్రజల్లో ఆగ్రహం పెంచేశారు. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈరోజు అమెరికన్లు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ ప్రదర్శనలకు ప్లాన్ చేశారు. న్యూయార్క్‌లో లక్ష మందికి పైగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలిపారని అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. 

Also Read :  మేము దాడి చేయకపోతే..25వేల మంది చనిపోయేవారు..జలాంతర్గామి దాడిపై ట్రంప్ సమర్ధన

Also Read :  గాజాపై దాడికి హమాస్ ప్లాన్...హెచ్చరించిన అమెరికా

పది నెలల్లో మూడుసార్లు..

ఈ నిరసనలకు డెమోక్రాట్ల నుంచి విపరీమైన మద్దతు లభించింది. ఇండివిజిబుల్‌ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్‌ బర్గ్‌ ఈ ప్రదర్శనలకు ప్రాతినిధ్యం వహించారు. అయితే రిపబ్లికన్ పార్టీ మాత్రం వీటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన పదినెలల్లో ఆయనకు వ్యతిరేకంగా మూడు సార్లు నిరసనలు జరిగాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక సంస్కరణల పేరుతో ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో డోజ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విభాగం వల్ల వేలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే జనతఃపౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసలు తదితర అంశాల్లో కూడా మార్పులు చేశారు. మరోవైపు వలసదారులపై అధికారులు సోదాలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే ట్రంప్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికన్లు రోడ్లపైకి ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు