US Strikes 'Drug-Carrying Submarine': మేము దాడి చేయకపోతే..25వేల మంది చనిపోయేవారు..జలాంతర్గామి దాడిపై ట్రంప్ సమర్ధన

కరేబియన్ సముద్రంలో జలాంతర్గామిపై దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు. అలా చేయకపోయి ఉంటే మాదక ద్రవ్యాలు యూఎస్‌కు చేరి 25వేల మంది అమెరికన్లు చనిపోయి ఉండేవారని అన్నారు. 

New Update
us strikes

కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న జలాంతర్గామిపై అమెరికా(usa) సైన్యం దాడి చేసింది. ఇందులో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే మరి కొందరిని వారి స్వస్థలమైన ఈక్వెడార్, కొలంబియాలకు వెనక్కు పంపించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ప్రసిద్ధ నార్కోట్రాఫికింగ్ ట్రాన్సిట్ మార్గంలో అమెరికా వైపు ప్రయాణిస్తున్న చాలా పెద్ద డ్రగ్ మోసుకెళ్ళే జలాంతర్గామిని ధ్వంసం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం అని అధ్యక్షుడు అన్నారు. దీనికి సంబంధించి ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు. ఆ జలాంతర్గామి నిండా ఫెంటానిల్, ఇతర మాదక ద్రవ్యాలు ఉన్నాయని తెలిపారు. అవి కనుక యూఎస్‌కు చేరితే 25వేలమంది అమెరికన్లు చనిపోయేవారని చెప్పారు. అరెస్ట్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలకే పంపించేశామని ట్రంప్(Donald Trump) చెప్పారు. 

Also Read :  No King Protest: ట్రంప్ అధ్యక్ష పదవికి గండం? వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి..

చట్టప్రకారం శిక్ష..

కొలంబియా అధ్యక్షుడు పెట్రో కూడా దీనిపై స్పందించారు. అరెస్ట్ చేసిన అనుమానితుడిపై సరైన విచారణ జరిపించి చట్ట ప్రకారం శిక్ష విధిస్తామని అన్నారు. ఎక్స్‌లో దీనికి సంబంధించి పోస్ట్ పెట్టారు. కానీ అమెరికా సైన్యం చంపిన వ్యక్తి మాత్రం కొలంబియా ఫిషర్‌మ్యాన్ అని అన్నారు. అతనిని ఎందుకు చంపారో ట్రంప్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు లాటిన్ అమెరికా నుండి అమెరికాకు మాదకద్రవ్యాల ప్రవాహాన్ని అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ అన్నారు. సెప్టెంబర్ నుండి కరేబియన్‌లో అమెరికా దాడులకు కనీసం ఆరు నౌకలు, వాటిలో ఎక్కువ భాగం స్పీడ్ బోట్లతో మాదక ద్రవ్యాలను తీసుకుని వచ్చారని...వాటిలో కొన్నింటికి వెనిజులా మూలమని ఆరోపించారు. ఇప్పటి వరకు కనీసం 27 మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం సరైనదే అయినా రవానాదారులను లక్ష్యంగా చేసుకుని చంపడం మాత్రం చట్టవిరుద్ధమని న్యాయనిపుణులు వాదిస్తున్నారు. 

Also Read: US Waring On Hamas: గాజాపై దాడికి హమాస్ ప్లాన్...హెచ్చరించిన అమెరికా

Advertisment
తాజా కథనాలు