/rtv/media/media_files/2025/09/11/nepal-prisoners-escape-2025-09-11-07-08-44.jpg)
Nepal Prisoners escape
Nepal Prisoners : నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు సద్ధుమణగలేదు. యువత నిరసనల నేపథ్యంలో నేపాల్ వ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులకు దారితీశాయి. దీంతో దేశవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దేశ పరిస్థితులను అదనుగా చేసుకుని దేశంలోని పలు జైళ్ల నుంచి దాదాపు ఏడు వేల మంది ఖైదీలు పరారయ్యారు. నేపాల్‌లో ఉన్న నౌబస్తాలోని ఓ బాల సదనంలో పలువురు బాల నేరస్తులు భద్రతాబలగాలపై తిరగబడ్డారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు మైనర్లు మృతి చెందారు. మైనర్లు భద్రతాసిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ క్రమంలో సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఐదుగురు బాల నేరస్తులు ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
‘‘ఇలాగే పలు జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశంలోని పలు జైళ్ల నుంచి సుమారు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. రాజ్‌బిరాజ్, ఝుంప్కా, చిట్వాన్, నక్కూ, కైలాలీ, ఢిల్లీబజార్, జాలేశ్వర్ మొదలగు జైళ్ల నుంచి వేలాది మంది తప్పించుకున్నారు. నౌబస్తా బాలసదనం నుంచి 76 మంది మైనర్ నేరస్తులు పరారయ్యారు. ఈ పరిణామాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఖైదీల నుంచి తమకు ప్రాణభయం ఉందని తెలిసి అనేక మంది బాధితులు ఇళ్లు వీడి అజ్ఞాతంలోకి వెళుతున్నారు’’ అని నేపాల్ మీడియా కథనాలు వెల్లడించాయి.
Also Read: నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చిన 11 ఏళ్ల బాలిక.. అసలు కథ ఇదే !
సింధూలిగఢీ జైల్లో కూడా ఖైదీలు నిప్పు పెట్టారని, భద్రతా దళాలను బయపెట్టి అక్కడి నుంచి 43 మంది మహిళలు సహా మొత్తం 471 మంది ఖైదీలు పరారయ్యారని అధికారులు తెలిపారు. నవాల్‌పరాసీ వెస్ట్ జిల్లా జైలు నుంచి 500 మంది తప్పించుకున్నారు. ఢిల్లీబజార్ జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నించిన ఓ ఖైదీని స్థానికులు పట్టుకుని తిరిగి సైన్యానికి అప్పగించారు. భారత్- నేపాల్ సరిహద్దులో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోకి చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఖైదీలను సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ) దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Also Read: ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని.. ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..!
ఇదిలా ఉండగా నేపాల్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత మూసివేసిన ఖాట్మాండ్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తిరిగి ఓపెన్ చేశారు. బుధవారం సాయంత్రం నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు నేపాల్ ఆర్మీ ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆందోళనలను అదుపు చేయడానికి దేశవ్యాప్తంగా సైన్యం కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు, దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారులతో ఈ రోజు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను ఆయన ముందంచారు. నేపాల్‌రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని, అవసరమైతే తిరిగిరాయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా