/rtv/media/media_files/2025/09/10/nepal-protests-2025-09-10-11-51-26.jpg)
11 Year Old girl led to fall of KP Sharma Oli Government in Nepal
నేపాల్(Nepal) లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి, రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ(kp-sharma-oli) తో సహా పలువురు మంత్రులు ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేశారు. అలాగే పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు. దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 22 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు. చివరికి కేపీ శర్మ ఓలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అలాగే పలువురు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అధికార ప్రభుత్వం కూలిపోయింది.
11 ఏళ్ల బాలికను ఢీకొన్న మంత్రి కారు
చాలామంది అక్కడ సోషల్ మీడియా(Social Media) ను బ్యాన్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉందనే విషయం మీకు తెలుసా ?. ఆమెకు జరిగిన ఓ సంఘటనే జనరేషన్ Z యువతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా దారి తీసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు ప్రారంభంలో ఓ 11 బాలిక పాదచారుల క్రాసింగ్ వద్ద నిలబడింది. అదే సమయంలో ఓ మంత్రి ప్రభుత్వ కారు ఆ బాలికను ఢీకొంది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి.
हरिसिद्धीमा प्रदेशमन्त्रीको गाडीले यसरी दिएको थियो ठक्कर#baahrakharinews#accidentpic.twitter.com/bVQ9lHAoOS
— Baahrakhari (@12khari) September 6, 2025
తేలిగ్గా తీసుకున్న ప్రధాని
మంత్రి కారు మాత్రం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయేందుకు యత్నించింది. స్థానికులు మాత్రం ఆ కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్న మంత్రి డ్రైవర్‌ను కేవలం 24 గంటల్లోనే విడుదల చేశారు. ఇది అక్కడి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా ఇదొక చిన్న సంఘటన అంటూ మాట్లాడారు. ఇది వాళ్లని మరింత రెచ్చగొట్టింది.
Also Read: నేపాల్ తర్వాతి ప్రధాని ఎవరు? జెన్ Z ఓటు ఆ ఇద్దరిలో ఎవరికి?
సోషల్ మీడియాలో బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ బాలిక రోడ్డుపై గాయపడిందని, కానీ ప్రభుత్వ కారు మాత్రం ఆగకుండా వెళ్లిపోయిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. JusticeForTheGirl అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్టులు వైరలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఇప్పటికే నిరుద్యోగం, అవినీతి వల్ల అక్కడి ప్రజలు నేపాల్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. అయితే బాలికకు జరిగిన ఘటన వాళ్లని మరింత ఆగ్రహానికి గురిచేసింది.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి నిలదీశారు. దీంతో కేపీ శర్మ ఓలి ప్రభుత్వం తమకు వ్యతిరేకత పెరుగుతోందనే కారణంతో సోషల్ మీడియాను కట్టడి చేయాలని భావించింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా యాప్స్‌ను ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. ఇందుకోసం ఆగస్టు 28 గడువు విధించింది. సోషల్ మీడియాలో ఫేక్‌న్యూస్, విద్వేష ప్రచారం పెరుగుతోందనే కారణంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే గడువు దాటినా కూడా సోషల్ మీడియా సంస్థలు ఐటీశాఖ వద్ద రిజిస్టర్ చేసుకోలేవు.
Also Read: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ..ఇండియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని కామెంట్
సోషల్ మీడియా బ్యాన్
దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ 4న సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం యువతలో మరింత ఆగ్రహానికి తెరలేపింది. దీంతో సెప్టెంబర్ 8న రాజధాని కాట్మాండుతో పాటు తదితర ప్రాంతాల్లో యువత జనరేషన్ Z పేరుతో నిరసనలు చేశాయి. పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌లు, వాటర్ కెనన్‌లు ప్రయోగించారు. పోలీసులకు, యువతకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరోజు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఓలి ప్రభుత్వం ఆ రాత్రికి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసింది.
ఆ తర్వాత మరుసటి రోజు (సెప్టెంబర్ 9న) కూడా జెన్ జెడ్ యువత ఆందోళనలు చేసింది. ప్రధాని, పలువురు మంత్రు ఇళ్లకు నిప్పు పెట్టారు. చివరికి కేపీ శర్మ ఓలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇతర మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. మంగళవారం జరిగిన ఘర్షణల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 22కి పెరిగింది. ప్రస్తుతం నేపాల్ ఆర్మీ ప్రభుత్వ అధికారాలను తమ చేతుల్లోకి తీసుకుంది. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు సంయమనం పాటించాలని సూచనలు చేస్తోంది.