/rtv/media/media_files/2025/09/10/varun-tej-2025-09-10-16-12-07.jpg)
varun tej
Varun Tej: మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ బాబు ఫోటోను పంచుకున్నారు. ''Our little man 🩵🩵🩵'' మ్యాన్ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ జోడించారు. దీంతో మెగా అభిమానులు వరుణ్ - లావణ్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మూడో తరం మెగా వారసుడు వచ్చాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్నారి, మెగా కుటుంబంలోని మూడో తరంలో తొలి అబ్బాయి కావడం మరింత ప్రత్యేకం. దీంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో లావణ్య మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం.
మెగాస్టార్ శుభాకాంక్షలు
వరుణ్ కి బిడ్డ పుట్టాడని తెలియడంతో మెగాస్టార్ షూటింగ్ నుంచి నేరుగా నాగబాబు ఇంటికి వెళ్లి బాబును చూశారు. వరుణ్- లావణ్య దంపతులకు శుభాకంక్షాలు తెలియజేశారు. అలాగే బాబును ఎత్తుకొని దిగిన ఫొటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ''ప్రపంచానికి స్వాగతం మై లిటిల్ వన్ ! కొణిదెల కుటుంబంలో అడుగుపెట్టిన మరో బుజ్జి బాబుకి స్వాగతం. ప్రౌడ్ పేరెంట్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠికి హృదయపూర్వక అభినందనలు. గ్రాండ్ పేరెంట్స్ గా మారిన నాగబాబు, పద్మజకు శుభాకాంక్షలు. మా బుజ్జి బాబుకు మంచి ఆరోగ్యం, సంతోషాలు, అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డ చుట్టూ ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ మెగాస్టార్ పోస్ట్ పెట్టారు.
మెగా బ్రదర్ నాగబాబు కూడా తన మనవడు పుట్టిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మై డియర్ లిటిల్ వన్ ❤️.. నువ్వు ఉదయపు మంచులా, శ్శబ్దంగా వాగ్దానంతో నిండి వచ్చావు. నీ కళ్ళల్లో మన కుటుంబ భవిష్యత్తు యొక్క సూర్యోదయాన్ని నేను చూస్తున్నాను. వెల్కమ్ మై లిటిల్ లయన్ కబ్! నీ చేయి పట్టుకొని నీ పక్కన నడవడానికి నేను ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టారు.
అంతరిక్ష్యం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ - లావణ్య అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత దాదాపు చాలా సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట 2023లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఇటలీలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్ళైన రెండేళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు.
Also Read: VAYUPUTRA: మొన్న 'మహా అవతార్'.. ఇప్పుడు 'వాయుపుత్ర'.. 3D యానిమేషన్‌లో హనుమాన్ కథ!