/rtv/media/media_files/2025/09/10/raja-saab-trailer-2025-09-10-15-15-18.jpg)
Raja Saab Trailer
Raja Saab Trailer: తేజ సజ్జా(Teja Sajja) ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ "మిరాయ్"(Mirai Release) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, పురాణాత్మక టచ్‌తో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.
సినిమా రిలీజ్ దగ్గర పడడంతో, ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్(Producer TG Vishwaprasad) పలు విషయాలు స్పష్టం చేశారు. ముఖ్యంగా, "మిరాయ్" టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని చెప్పారు. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సినిమా కంటెంట్‌పై మంచి నమ్మకముందని, అందుకే టికెట్ ధర పెంపు అవసరం లేదన్నారు.
ఇక అదే ప్రెస్‌మీట్‌లోనే మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. అదేంటంటే, ప్రముఖ హీరో ప్రభాస్ నటిస్తున్న "ది రాజాసాబ్" సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
Also Read:హనుమాన్ తర్వాత తేజ ఖాతాలో మరో హిట్.. 'మిరాయ్' సెన్సార్ టాక్ ఇదే !
We are getting jan Raja Saab trailer release updates but not getting kantara update trailer release update🤦🤦 https://t.co/U4d2CQoNXy
— Pavan#Indiawantsdictatorship (@Pavand_y) September 9, 2025
ట్రైలర్ డేట్ ఫిక్స్.. (Raja Saab Trailer Update)
ఇంకా ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం, అక్టోబర్ 2న "ది రాజాసాబ్" ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. రిషబ్ శెట్టి నటిస్తున్న "కాంతారా 2" సినిమాతో పాటుగా "కాంతారా 2" విడుదలయ్యే థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. అదే విధంగా, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 23) తొలి పాట(Raja Saab First Single) విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’పై నేచురల్ స్టార్ నాని హాట్ కామెంట్స్..
ఇప్పటికే "ది రాజాసాబ్" టీజర్ రిలీజై మంచి స్పందన పొందింది. సినిమా హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతుండడం విశేషం. ఇది ప్రభాస్ కెరీర్‌లో మొదటి హారర్ సినిమా కావడం మరో హైలైట్. మేకర్స్ ఈసారి పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. నగర శివార్లలో భారీ థియేటర్ సెటప్ వేసి, అక్కడే కీలక సీన్లు షూట్ చేస్తున్నారు.
Also Read: వైరలవుతున్న ప్రభాస్ ఆధార్ కార్డు.. డార్లింగ్ పూర్తి పేరు ఇంత పొడవా!
ప్రభాస్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకటి తాత పాత్రగా, మరొకటి మనవడిగా ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభాస్ నవంబర్‌లో 15 రోజుల కాల్‌షీట్ ఇవ్వగా, మొత్తం 20 రోజుల షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.
మొత్తంగా చూస్తే, "మిరాయ్" సినిమాతో తేజ సజ్జా యూత్‌ను ఆకట్టుకోబోతుంటే, ప్రభాస్ "ది రాజాసాబ్"తో మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నవ్వులు, థ్రిల్ రెండూ అందించబోతున్నాడు.