/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
Elon Musk with trump Photograph: (Elon Musk with trump)
అమెరికా దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా..భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడ నియామకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. షోరూం ల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమే అని వ్యాఖ్యానించారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.వీరిద్దరూ కలిసి ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్ లోకి టెస్లా ఎంట్రీ ప్రణాళికలపై ట్రంప్ మాట్లాడారు.
Also Read: Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్!
ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. సుంకాలతో మా నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంతో మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోంది. ఉదాహరణ భారతే..!ఇప్పుడు ఆయన భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆయన వరకు అది మంచిదే కావొచ్చు..కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే..అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గతవారం భారత ప్రధాని మోడీతో భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఆ సమావేశంలో విద్యుత్ కార్ల పై అధిక సుంకాల విషయాన్ని మోడీ తో ప్రస్తావించినట్లు తెలిపారు.
సుంకాల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు కలిసి పని చేసేలా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల మోడీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఆయనతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సంస్థ. భారత్ లో నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విక్రయ కార్యలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.
ఈవీ పాలసీని ఆవిష్కరించిన..
అయితే..భారత్ లో విద్యుత్ కార్ల తయారీ పై టెస్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడంతో ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15 శాతానికి తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తోంది. ఈ పరిణామాల వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: hyderabad: తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్