USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఔషధాల దిగుమతుల మీద 25 శాతం సుంకాలు విధిస్తామని చెప్పారు. దీంతో భారత్ లో ఫార్మాకు పెద్ద దెబ్బ కొట్టినట్టయింది. దెబ్బకు ఒక్కసారిగా వీటి స్టాక్స్ డౌన్ అయిపోయాయి. 

New Update
usa

Tariffs On Pharma

రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నారు. దెబ్బల మీద దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే సుంకాల విషయంలో అన్ని దేశాలకు పంచ్ ఇచ్చారు. సుంకాల మోత మోగిస్తూ అందరి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. రాగానే మెక్సికో, కెనడా, చైనాల నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాల్ని ప్రకటించారు. మిగతా దేశాలకు కూడా మీరెంత అంటే మేమూ అంతే అంటూ సుంకాల పొగల్ని రగిల్చారు. అయితే ఆ దేశాలు అభ్యర్ధించగా..నెల రోజులు వాయిదా వేశారు. ఆ తర్వాత చైనా దిగుమతులపై 10శాతం సుంకాల్ని అమలు చేశారు. కానీ స్టీల్ , అల్యూమినియం పై దిగుమతులపై 25 శాతం ప్రకటించారు. 

దెబ్బ మీద దెబ్బ కొడుతున్న ట్రంప్..

ఇప్పుడు ఈ సుంకాలపై ట్రంప్ మరో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఔషధాల దిగుమతులపైనా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 2న దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇది చాలా దేశాల ఫార్మా కంపెనీలకు పెద్ద దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత దేశానికి. దీనికి కారణం అమెరికాకు మందులు ప్రధానంగా జనరిక్ ఔషధాలు ఎక్కువగా మన దేశం నుంచి ఎగుమతి అవుతుండటమే. ఇందులో ఏటా బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఔషధాల ఎగుమతుల్లో అమెరికా వాటానే 31 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, లుపిన్, అరబిందో ఫార్మా వంటివి ఉన్నాయి.

ఇన్ని రోజులూ మందులపై అధిక సుంకాలు విధిస్తే వాటి రేట్లు పెరిగి అమెరికా ప్రజలే ఇబ్బందులు పడతారు కాబట్టి ట్రంప్ వాటికి వెళ్ళరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ హోప్ కాస్తా తీసి పారేశారు. ట్రంప్ ఈరోజు చేసిన ప్రకటన నిజమైతే కనుక మన దేశ ఫార్మీ విపరీతంగా దెబ్బతింటుంది. ఏటా భారత్ నుంచి మందుల ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కవు అవుతాయి. దీంట్లో అధిక భాగం అమెరికాకే వెళతాయి. ఇండియా ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎక్కువగా జెనరిక్​ మందులు అమ్ముతున్నాయి. 

ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అసలే నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు మరింత పీకల్లోతు నష్టాల్లోకి దిగజారాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీల షేర్లు అన్నీ పడిపోయాయి. దీంతో లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read: Allu Arjun: బన్నీ ఖాతాలో మరో ఘనత..హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై..

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు