Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్!

కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్‌ నుంచి ప్రయాగ్‌ రాజ్‌,కాశీ నగరాల మీదుగా బీహార్‌ కు వెళ్లే ,వచ్చే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.

New Update
maha kumbha mela 2025

maha kumbha mela 2025

అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌,కాశీ నగరాల మీదుగా బీహార్‌ కు వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ,అటు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.

Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

బుధవారం బయల్దేరాల్సిన ఇదే రైలును రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన రైల్వే బోర్డు ..ఇప్పుడు ఏకంగా నెలాఖరు వరకు రద్దు చేసింది. ఇటార్సి-ప్రయాగ్‌రాజ్‌ రూట్‌ లో..అదే విధంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్ కు నిత్యం వందల రైళ్లు నడుస్తున్నాయి.

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

రోడ్డు, వాయు మార్గాల్లో...

కానీ సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే ఏకైక రెగ్యులర్‌ రైలును బోర్డు ఏకపక్షంగా రద్దు చేయడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహా కుంభమేళాలో ఈ వారం మరింత కీలకం. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ఇది ముగుస్తుంది. రోడ్డు, వాయు మార్గాల్లో వెళ్లే వీలు లేకపోవడంతో సామాన్యులతో పాటు ఉన్నత స్థాయి కుటుంబాలూ రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాయి.

చాలా మంది కుంభమేళాతో పాటు పక్కనే ఉన్న కాశీ నగరంతో పాటు అయోధ్యకు వెళ్లి వస్తున్నారు. కుంభమేళాకు వెళ్లేందుకు నెలలు, వారాల ముందే టికెట్లు తీసుకున్న దాదాపు 36 వేల మంది ప్రయాణికులు రైలు రద్దుతో హతాశులయ్యారు.

సికింద్రాబాద్‌-దానాపూర్‌ రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌  ను రద్దు చేసిన రైల్వే బోర్డు..ఫిబ్రవరి 20 నుంచి 28 తేదీల్లో చర్లపల్లి -దానాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కానీ ఈ రైళ్లు నల్గొండ, విజయవాడ,భువనేశ్వర్‌ , పట్నా మీదుగా దానాపూర్‌ కు వెళ్తాయి. అటు ప్రయాగ్‌రాజ్‌ కానీ ఇటు కాశీ కానీ వెళ్లవు. 

Also Read: Rekha Gupta Net Worth : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు