/rtv/media/media_files/2025/02/20/1djbgVcvrFILs1lHb1Mj.jpg)
city killer
భూమి వైపు ఓ గ్రహ శకలం దూసుకు వస్తుందని నాసా తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా 2024 YR4 పేరుగా నామ కరణం చేసిన ఈ గ్రహశకలం.. చూసేందుకు చిన్నగా ఉన్నా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నాసా వివరించింది. ఇది 2032లో భూమిని ఢీకొట్టబోతుండగా.. ఆ ప్రాంతాలపై పడే అవకాశం ఉందని వివరించింది. ముఖ్యంగా ఐదు నగరాల్లో పడే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు చెప్పగా.. అందులో భారత దేశానికి చెందిన రెండు ప్రాంతాలు కూడా ఉన్నాయి.అవే కోల్‌కతా, ముంబై. ఈ గ్రహశకలం ఏ ప్రాంతంలో పడితే.. ఆ నగరం అంతా కాలి బూడిద అయిపోతుందని.. అందుకే దానికి "సిటీ కిల్లర్"గా పేరు పెట్టినట్లు వెల్లడించింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి భారత ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
2024 YR4 అనే పేరు ఉన్న ఆస్టరాయిడ్.. భూమి వైపు దూసుకు వస్తున్నట్లు తాజాగా నాసా ప్రకటించింది. అయితే భూమి వైపు వస్తున్నా కొద్ది.. భూమండలాన్ని ఢీకొట్టే అవకాశం మరింత పెరుగుతూ వస్తోందని వివరించింది. ఇప్పటి వరకు దాన్ని గమనించగా.. అది భూమిని తాకే అవకాశం 3.1 శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇది ఒకవేళ భూమిని ఢీ కొడితే.. ఆ పెద్ద నగరం పూర్తిగా నాశనం అవుతుందని చెప్పుకొచ్చింది.
Also Read: Zelensky: ట్రంప్ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు!
వాయు విస్ఫోటనంగా మారే...
ఈ సిటీ కిల్లర్ భూగ్రహాన్ని ఢీకొట్టే శాతం 2.6 శాతంగా ఉన్నట్లు గతంలో ప్రకటించగా.. 2024 జనవరి నెల నాటికి దీని శాతం కేవలం 1. కానీ ఏడాదిలోనే 3.1 శాతానికి పెరగడంతో శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలనే దాన్ని నిత్యం పరిశీలిస్తున్నారు. అయితే కేవలం 40 నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్న ఇది.. భూమిపైకి చేరితే వాయు విస్ఫోటనంగా మారే ఛాన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని వల్లే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగబోతుందని అంచనా వేస్తున్నారు.
దీని వల్ల ప్రపంచం మొత్తం నాశనం అయ్యే అవకాశం లేకపోయినా.. ఓ నగరం మొత్తం కాలి బూడిద అవుతుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సిటీ కిల్లర్ 2032లో డిసెంబర్ 22వ తేదీన భూమిని ఢీకొట్టబోతున్నట్లు శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అలాగే ఇది భూమిపై ఉన్న తూర్ఫు పసిఫిక్, ఉత్తర దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆఫ్రియా, అరేబియా సముద్రం, దక్షణాసియ ప్రాంతాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉందని వివరిస్తున్నారు.
అలాగే ఈ దేశాల్లోని ముంబై, కోల్‌కతా, ఢాకా, బొగోటా, అబిడ్జాన్, లాగోస్, ఖార్టూమ్ వంటి నగరాల్లో పడితే.. పెద్ద ఎత్తున జనాలు ప్రాణాలు కోల్పోతారని.. ఆ నగరాలు మొత్తం పూర్తిగా తుడిచి పెట్టుకుపోతాయని నిపుణులు అంటున్నారు.
Also Read: Rekha Gupta Net Worth : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
Also Read: BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు