Army: ఆ సైన్యంలో చేరకండి.. కేంద్రం సంచలన హెచ్చరిక

ఉక్రెయిన్‌పై పోరాడేందుకు కొందరు భారతీయులు రష్యా సైన్యంలో పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. రష్యా ఇచ్చే ఆర్మీ ఆఫర్లు చాలా ప్రమాదకరమని హెచ్చరికలు చేసింది.

New Update
MEA On Reports Of Indians Recruited Into Russian Army

MEA On Reports Of Indians Recruited Into Russian Army

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై పోరాడేందుకు కొందరు భారతీయులు రష్యా సైన్యంలో పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. రష్యా ఇచ్చే ఆర్మీ ఆఫర్లు చాలా ప్రమాదకరమని హెచ్చరికలు చేసింది.  '' రష్యన్ ఆర్మీలో భారతీయ పౌరులను నియమించుకున్నట్లు పలు రిపోర్టులు మా వద్దకు వచ్చాయి. ఆ దేశ సైన్యంలో పనిచేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో గతేడాదిగా ప్రభుత్వం వివిధ సందర్భాల్లో హెచ్చిరించింది. 

Also Read: ఘోర ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్ లీకై భారీ పేలుడు, ముగ్గురు మృతి

ఇది ప్రమాదకరం

రష్యా ఆర్మీలో చేరడం ప్రమాదం. అందుకే వాళ్లు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండండి. వాళ్ల సైన్యంలో చేరకండని మళ్లీ సూచనలు చేస్తున్నాం. అంతేకాదు ప్రస్తుతం వాళ్ల ఆర్మీలో పనిచేస్తున్న భారతీయ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకోసం రష్య అధికారులతో చర్చలు జరుపుతున్నాం. బాధిత కుటుంబాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని'' విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.    

Also Read: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం

పుతిన్‌తో చర్చ

కన్‌స్ట్రక్షన్‌ వర్క్(Construction Work) సాకుతో మమ్మల్ని రష్యాకు రప్పించి యుద్ధానికి పంపించారని ఉక్రెయిన్‌లో దొనెట్స్క్ ప్రాంతంలో ఉన్న ఇద్దరు భారతీయులు ఆరోపించారు. అయితే వాళ్లు స్టూడెంట్ లేదా విజిటర్స్‌ వీసా మీద అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశం వెలుగులోకి వచ్చిన క్రమంలోనే కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని రష్యా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. గతంలో కూడా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారతీయ పౌరులను ఇండియాకు తీసుకొచ్చేందుకు రష్యా సర్కార్‌పై కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. గతేడాది ప్రధాని మోదీ(PM Modi) రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పుతిన్‌తో కూడా చర్చించారు.  

Also Read: కాళ్లు చేతులు కట్టేసి..కుక్కర్‌తో కొట్టి...దారుణ హత్య

ఇదిలాఉండగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. ఇటీవల అలస్కాలో పుతిన్‌తో ఆ తర్వాత వాషింగ్టన్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా కాల్పుల ఒప్పందం కుదరేదు. పైగా అదే సమయంలో ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి కాల్పులకు దిగడం దుమారం రేపింది. మరోవైపు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్, చైనాపై ట్రంప్‌ 100 శాతం సుంకాలు పెంచాలని ఇటీవల యూరోపియన్ యూనియన్ దేశాలకు కూడా సూచనలు చేశారు. ఇప్పటికే ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేసి ప్రయోజనం పొందుతోందనే కారణంతో ఈ టారిఫ్‌లు విధించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిపోయింది.

Also Read: చంద్ర గ్రహణానికి నలుగురు పీఎమ్ లు బలి..సూర్య గ్రహణానికి ఆయనే.. గోయేంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్

Advertisment
తాజా కథనాలు