Gas Tanker Explosion: ఘోర ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్ లీకై భారీ పేలుడు, ముగ్గురు మృతి

మెక్సికోలో దారుణం జరిగింది.  బుధవారం మధ్నాహం ఓ ట్రక్కు గ్యాస్‌ ట్యాంకర్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగా గాయపడ్డారు.

New Update
Massive Gas Tanker Explosion in Mexico City Kills 3 peopl

Massive Gas Tanker Explosion in Mexico City Kills 3 peopl

మెక్సికో(Mexico) లో దారుణం జరిగింది.  బుధవారం మధ్నాహం ఓ ట్రక్కు గ్యాస్‌ ట్యాంకర్ లీకై(Gas Tanker Explosion) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తుండగా ట్రక్‌ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 18 వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 19 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.  

Also Read: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దేశవ్యాప్తంగా 8మంది ఉగ్రవాదుల అరెస్ట్‌..!

Massive Gas Tanker Explosion In Mexico City

ఈ ఘటనపై మెక్సికో సిటీ మేయర్‌ క్లారా బ్రుగాడా స్పందించారు. ఇదో విషాధ సంఘటన అని పేర్కొన్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారని పేర్కొన్నారు. రహదారిపై ఆ ట్రక్కు బోల్తా పడిన అనంతరం ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. గాయాలపాలైన బాధితులకు తామే వైద్య సాయం అందిస్తామని వెల్లడించారు. తన సోషల్ మీడియా(Social Media) ఖాతాలో గాయపడ్డ వారి వివరాలు కూడా విడుదల చేశారు. 

Also Read: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం

Advertisment
తాజా కథనాలు