Viral Post: చంద్ర గ్రహణానికి నలుగురు పీఎమ్ లు బలి..సూర్య గ్రహణానికి ఆయనే.. గోయేంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్

గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు దేశాల ప్రధానులు గద్దెను కోల్పోయారు. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రగ్రహణం అయిపోయింది..సూర్య గ్రహణానికి మాత్రం ఆయనే అంటూ ఎక్ లో పోస్ట్ పెట్టారు. 

New Update
harsh

రెండు రోజుల క్రితం చంద్ర గ్రహణం వచ్చింది. అది కూడా రెడ్ మూన్ గ్రహణం. ఇది చాలా అరుదుగా వస్తుంది. రెడ్ మూన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని...అది శుభం, అశుభం ఏదైనా కావొచ్చని నమ్ముతుంటారు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్ర గ్రహణం ఎఫెక్ట్ తో రెండు రోజుల వ్యవధిలో ప్రపంచంలో నలుగురు ప్రధానులు బలయ్యారు. జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయ్ లాండ్ ప్రధానులు తమ పదవులను కోల్పోయారు. దీని తరువాత సూర్య గ్రహణం రానుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దానిపై పడింది. దీనికి బలయ్యేది పెద్ద ఆరెంజ్ టింటెడ్ లీడర్ కావొచ్చు అంటూ గోయెంకా జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్తే సూపర్ వైరల్ అవుతోంది. ఆ ఆరెంజె టింటెడ్ లాడర్...ఆరెంజ్ కలర్ హెయిర్ తో ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సొంత దేశంలోనే ట్రంప్ కు వ్యతిరేకత..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచీ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు. వచ్చిన వెంటనే బోలెడు ఫైల్స్ మీద సంతకాలు పెట్టేశారు. దీంతో అమెరికాలోనే కల్లోలం రేగింది. అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశారు. దీంతో చాలా మంది తమ వారిని కోల్పోయారు. ఇప్పటికీ ఈ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెప్పా పెట్టకుండా ట్రంప్ యంత్రాంగం దాడులు చేస్తూనే ఉంది. ఇది అమెరికాలో ప్రజల ఆగ్రహానికి కారణ అవుతోంది. కొన్ని రోజుల క్రితం లాస్ ఏంజెలెస్ లో ఇదే విషయంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తరువాత డీసీలో కూడా నేషనల్ గార్డ్స్ ను డిప్లాయ్ చేశారు. ఇప్పుడు షికాగోలో కూడా అదే చేస్తున్నారు. ఈ విషయంపై అమెరికన్లు అధినేత ట్రంప్ పై మండిపడుతున్నారు. ఇది కాకుండా అమెరికాలో చాలా ఫెడరల్ ఉద్యోగాలను పీకేశారు. యూఎస్ ఎయిడ్ లాంటి వాటిని మూసేయడంతో అక్కడ ఫెడరల్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అదనపు సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడ్డారు ట్రంప్.  ఇదో పెద్ద వాణిజ్య యుద్ధానికి దారి తీసింది.  ముఖ్యంగా చైనా, భారత్ లపై విధించిన సుంకాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. భారత్ తో ఘర్షణ పెట్టుకోవడం మంచిది కాదని అమెరికాలోనే చాలా మంది ట్రంప్ కు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు. అలాగే వీసా రూల్స్ ను కఠినతరం చేయడం, విదేశీ విద్యార్థులపై ఆంక్షలు..ఇవన్నీ కూడా అధ్యక్షుడు ట్రంప్ కు తీవ్ర వ్యతిరేకంగా మారుతున్నాయి. ఈ కారణాల వల్ల అమెరికాలో ప్రజలు ప్రభుత్వం తిరగబడే అవకాశం ఉందని అంచనాలున్నాయి. 

ఆరోగ్యం విషయంలో కూడా ప్రశ్నలు..

వీటన్నింటికి తోడు ట్రంప్ ఆరోగ్యంపై కూడా అనుమానాలున్నాయి. రీసెంట్ గా ఆయన ఆరోగ్యంపై చాలా వార్తలు వచ్చాయి. మధ్యలో ఓ వారం ట్రంప్ కనిపించకుండా పోవడం.. ఆయన చనిపోయారనే వార్తలు రావడం ఆందోళనకు గురి చేశాయి. ట్రంప్ తీవ్ర గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెబుతున్నారు. వైట్ హౌస్ దీన్ని కొట్టి పారేసినప్పటికీ.. అధ్యక్షుడిలో వస్తున్న మార్పులు అది నిజమేనని నిర్ధారణ చేస్తున్నాయి. దానికి తోడు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తాను అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు పారిశ్రామిక వేత్త గోయెంకా కూడా  ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పై వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అంటున్నారు. త్వరలోనే ట్రప్ దిగిపోతారని కన్ఫార్మ్ చేసుకుంటున్నారు. 

#today-latest-news-in-telugu #america president donald trump
Advertisment
తాజా కథనాలు