Italy: ఆ దేశం వెళ్తున్నారా ? జాగ్రత్త.. లేదంటే జేబులకు చిల్లే

విదేశాలకు వెళ్తే టూరిస్టులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తోంది. తాజాగా ఇటలీ ప్రభుత్వం తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం కచ్చితంగా పలు నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది. లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని పేర్కొంది

New Update
Italy to slap tourists with heavy fines for bad behaviour

Italy to slap tourists with heavy fines for bad behaviour

చాలామంది పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్తుంటారు. మరికొందరు విదేశాలకు కూడా వెళ్తుంటారు. విదేశాలకు వెళ్తే మాత్రం టూరిస్టులు(tourists) కాస్త జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆయా దేశాలు విధించే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తోంది. తాజాగా ఇటలీ ప్రభుత్వం తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం కచ్చితంగా పలు నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది. లేకపోతే భారీగా జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. 

Also Read: ఇక మోదీ పెద్దన్న.. ట్రంప్కు జెలెన్స్కీ ఊహించని షాక్.. రష్యా-ఉక్రెయిన్ వార్లో బిగ్ ట్విస్ట్!

వాస్తవానికి చాలామంది పర్యాటకులు వెళ్లే దేశాల్లో ఇటలీ(Italy) కూడా ఉంటుంది. అక్కడ వెనీస్‌ సిటీని చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు చెత్తా, చెదారంతో నింపేశారు. దీంతో పర్యాటకరుల తీరుపై అక్కడి స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఈ విషయంపై అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటలీకి వచ్చే పర్యాటకులు తాము విధించిన రూల్స్ ఉల్లంఘిస్తే మన కరెన్సీలో దాదాపు రూ.35 వేల వరకు జరిగిమానా విధిస్తామని పేర్కొన్నారు.   

Also Read: రష్యాకు మరో షాక్.. ఉక్రెయిన్‌కు మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా

ఈ రూల్స్‌ ఏంటంటే

పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టులు నేలపై కూర్చొని తినడం, తాగడం చేయకూడదు. అలా చేస్తా 100-200 యూరోలు (రూ.10 వేల నుంచి రూ.20 వేలు) జరిమానా ఉంటుంది. నగరంలో కాలువల్లో స్నానం, డైవింగ్, స్విమ్మింగ్ లాంటివి టేస్తే 350 యూరోలు (రూ.35 వేలు), బహిరంగ ప్రాంతాల్లో చెత్తను వేయడం, ఉమ్మివేయడం చేస్తే కూడా 350 యూరోలు (రూ.35) జరిమానా విధిస్తారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో దుస్తులు విప్పేసి తిరగడం, స్విమ్ సూట్ ధరించడం లాంటివి చేసినట్లయితే 250 యూరోలు (రూ.25 వేలు) జరిమానా ఉంటుందని వెనీస్ అధికారులు స్పష్టం చేశారు. నగరాన్ని శుభ్రంగా ఉంటాలని.. స్థానికులను అసౌకర్యానికి గురిచేయకుండా ప్రవర్తించాలని సూచనలు చేసింది. 

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్

ఇదిలాఉండగా ఇలాంటి నిబంధనలు కేవలం ఇటలీలో మాత్రమే కాదు. పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో కూడా ఇలాంటి రూల్స్ ఉన్నాయి. ఎవరైనా పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘిస్తే లక్షల్లో జరిమానా విధిస్తున్నాయి. పోర్చుగల్‌లో అల్బుఫీరా అనే నగరంలో ఓ బీచ్ ఉంది. అక్కడ మాత్రమే స్విమ్‌ సూట్‌ ధరించేందుకు పర్మిషన్ ఉంటుంది. బయట స్విమ్‌సూట్‌తో కనిపిస్తే ఏకంగా రూ.1.50 లక్షలకు పైగా జరిమానా ఉంటుంది. ఇక స్పెయిన్‌లో చూసుకుంటే బలియరిక్ ఐలాండ్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం. ఎవరైనా మద్యం సేవిస్తూ పట్టుబడితే వాళ్లకు రూ.3 లక్షలకు పైగా జరిమానా ఉంటుంది. అందుకే విదేశాలకు పర్యటన చేస్తే అక్కడ రూల్స్‌ను తెలుసుకొని వెళ్లాలి. లేదంటే తెలియకుండా ఏవైనా పొరపాట్లు జరిగితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

Also read: గర్భిణీలు పారాసెటమాల్ టాబ్లెట్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు