/rtv/media/media_files/2025/08/25/pm-modi-invites-president-zelensky-to-india-amid-ongoing-diplomatic-engagement-2025-08-25-12-01-39.jpg)
PM Modi Invites President Zelensky To India Amid Ongoing Diplomatic Engagement
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం(Russia Ukraine War) ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రధాని మోదీ(pm modi) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy) ని భారత్‌కు రావాలని ఆహ్వానించారు. ఇండియాలో ఉంటున్న ఉక్రెయిన్ దౌత్యవేత్త అలెగ్జాండర్ పొలిష్చుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్ జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. '' భారత్‌కు జెలెన్‌స్కీ రాకకోసం ఇరుదేశాల అధికారులు పనిచేస్తున్నారు. ఆయన భారత్‌కు వస్తారని ఆశిస్తున్నాం.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక గొప్ప కార్యాచరణ కానుంది. ఆయన వచ్చేందుకు సరైన తేదీని అంగీకరించేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించాలి. భారత్‌కు రష్యాతో సుదీర్ఘకాలంగా బంధం ఉంది. అందుకే మేము శాంతి చర్చల్లో భారత్‌ను కీలక పాత్రధారిగా భావిస్తున్నాం. ప్రధాని మోదీ శాంతి, కాల్పుల విరమణను సమర్థిస్తున్నారు. భారత్ శాంతి, దౌత్యం, రాజకీయ చర్చలను దృఢంగా సమర్థిస్తోందని'' అలెగ్జాండర్ పొలిష్చుక్ పేర్కొన్నారు.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్
ట్రంప్ బాటలో మోదీ
మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్ బాటలోనే ప్రధాన మోదీ నడుస్తున్నారు. ఇరుదేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, యుద్ధం ముగించుకోవాలి ఇప్పటికే చాలాసార్లు మోదీ సూచనలు చేశారు. అయితే ఇప్పుడు జెలెన్‌స్కీని భారత్‌కు ఆహ్వానించి ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచారు. మరోవైపు త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్‌కు రానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంచలనం రేపుతున్న తరుణంలో ఇరుదేశాధినేతలు భారత్‌కు రానుండంతో మోదీ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
Also Read: ట్రంప్ చేతి మీద పెద్దవుతున్న మచ్చ..అసలేమైందంటూ చర్చ
జెలెన్‌స్కీ, పుతిన్ మోదీ మాట వినే ఛాన్స్
ఇప్పటికే భారత్, రష్యాతో చాలా దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో, ఉక్రెయిన్‌తో కూడా భారతదేశం బలమైన దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. దీంతో భారత్‌కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి గొప్ప అవకాశం ఇవ్వనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఇప్పటికే తటస్థ వైఖరిని అవలంబించింది. ఏ దేశం మొగ్గు చూపకుండా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. ఈ తటస్థ వైఖరితో ఉండటం వల్ల పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరూ మోదీ అభిప్రాయాలను వినే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇదిలాఉండగా ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ అలస్కాలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్.. జెలెన్‌స్కీతో కూడా సమావేశమై పలు అంశాల గురించి చర్చలు జరిపారు. అయినా కూడా ఈ భేటీల్లో ఇరుదేశాల మధ్య యుద్ధం ముగింపు విషయం కొలిక్కి రాలేదు.మరోవైపు ఉక్రెయిన్ తమ ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి 3,350కి పైగా ఎక్స్‌టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ మిసైల్స్‌ను అందించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.