/rtv/media/media_files/2025/03/07/0kxNEa4EVdWQq7WsT4fe.jpg)
srael rescues Indians Photograph: (srael rescues Indians)
Israel Rescues Indians: భవన నిర్మాణ రంగంలో పని కోసం భారత్ నుంచి వెళ్లిన 10 మంది కార్మికులను ఇజ్రాయిన్ రక్షించినట్లు ఆ దేశ పాపులేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ తెలిపింది. జనాభా మరియు ఇమ్మిగ్రేషన్ అథారిటీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, న్యాయ మంత్రిత్వ శాఖతో కలిసి గురువారం రాత్రి ఓ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్మికులను ప్రలోభపెట్టి, పాలస్తీనియన్లు పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారని, ఇజ్రాయిల్ ప్రాంతానికి పనిలోకి రాకుండా వెస్ట్ బ్యాంక్ గ్రామంలో నిర్భందించారని ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు.
Also Read: US tariff on India: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు
పాలస్తీనియన్లు పని ఇప్పిస్తామని హామీ ఇచ్చి వెస్ట్ బ్యాంక్ గ్రామమైన అల్-జాయెమ్‌కు కార్మికులను రప్పించి, ఆపై వారి పాస్‌పోర్ట్‌లను తీసుకొని హమాస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని అధికారులు వివరించారు. ఇజ్రాయెల్‌లోని చెక్‌పాయింట్‌లను సులభంగా దాటడానికి పాలస్తీనియన్లు ఇండియన్స్ పాస్‌పోర్ట్‌లను ఉపయోగిస్తున్నారని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు రాశాయి.
Just in: Israel says it has rescued ten Indian workers "who had come to Israel to work in the construction industry but were being held" in West Bank; A detailed statement by Israel says, their "passports had been taken from them"
— Sidhant Sibal (@sidhant) March 6, 2025
Pic by Israel Govt pic.twitter.com/yr8d916I4u
ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ నుంచి రక్షిణ 10 ఇండియన్ లేబర్‌ను ఇజ్రాయిల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వారి ఐడెటిఫికేషన్, పార్ట్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. వారు సేఫ్‌గా ఉన్నారని వారికి పని దొరికాక.. యజమానులకు వారిని అప్పగిస్తామని ఇజ్రాయిల్ అధికారులు చెప్పారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత పదివేల మంది పాలస్తీనా నిర్మాణ కార్మికులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా హమాస్ నిషేధించారు. ఇజ్రాయిల్‌లో వారి అవసరాన్ని భర్తీ చేయడానికి గత ఏడాది కాలంలో భారతదేశం నుండి దాదాపు 16,000 మంది కార్మికులు నిర్మాణ పరిశ్రమలో పనిచేయడానికి ఇజ్రాయెల్‌కు వచ్చారని పాపులేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ తెలిపింది.
Also Read: Trump Warning : హమాస్‌కు ట్రంప్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.. ‘వారి శవాలు మీకెందుకు’
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!