US tariff on India: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు

అమెరికా భారత్‌పై విధించే టారిఫ్ కారణంగా యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి వినియోగదారులు, కంపెనీలకు నష్టం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇండియలో ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడనుంది.

New Update
US tariffs on India

US tariffs on India Photograph: (US tariffs on India)

రెండవ సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నిర్ణయాలు, కామెంట్స్ చర్చలకు దారితీస్తున్నాయి. అమెరికా టారిఫ్ పెంపుపై ట్రంప్ నిర్ణయంపై అనేక దేశాలపై ప్రభావం చూపనుంది. టారిఫ్ అంటే ఒక దేశానికి దిగుమతి అయ్యే లేదా ఆ దేశం ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులపై విధించే పన్ను.  ఈ పన్ను విషయంలో ట్రంప్ పట్టుబట్టి కూర్చున్నాడు. ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని.. ఏప్రిల్ 2 నుంచి అమలు అవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్..వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని అన్నారు. 

Also read: Trump Warning : హమాస్‌‌కు ట్రంప్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.. ‘వారి శవాలు మీకెందుకు’

ట్రంప్‌ చెబుతున్న ప్రతీకార సుంకాలు భారత్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సుంకాల వల్ల అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువల రేట్లు పెరగనున్నాయి. అంతేకాదు.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై కూడా ట్యాక్స్ కట్టాలి. అమెరికా భారీగా టారీఫ్ విధిస్తే అటు మ్యానిఫ్యాక్చర్ రంగం, ఇటు వినియోగదారులు నష్టపోతారు. ట్రంప్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడయ్యాక 2017లో కూడా భారత్‌పై టారిఫ్ ట్యాక్స్ వేటు వేశాడు. భారత్‌ నుంచి 761 మిలియన్‌ డాలర్ల స్టీల్, 382 మిలియన్‌ డాలర్ల అల్యూమినియం దిగుమతులపై ఆయన వరుసగా 25%, 10% సుంకాలను విధించారు. దీనికి ప్రతిగా 2019లో భారత ప్రభుత్వం 28 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించింది. ఇక ఇప్పుడు భారత్‌పై ప్రతికార సుంకాలు విధిస్తామని, ఇండియా ట్యాక్స్‌ల్లో రారాజు అని ట్రంప్ మాట్లాడుతున్నారు. 

Also read: Breaking: విదేశాంగ మంత్రి జైశకర్ పై ఖలీస్థానీల దాడికి యత్నం

ముత్యాలు, రంగు రాళ్లు, ఔషధాలు, ఫుడ్ ప్రొడక్ట్స్ భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీంతో ఈ పరిశ్రమలకు వచ్చే లాభాలు తగ్గనున్నాయి. దీంతోపాటు అమెరికా నుంచి భారత్‌కు దిగుమతయ్యేవి విద్యుత్‌ మెషినరీ పరికరాలు, అణు రియాక్టర్ యంత్రాలు, ఖనిజ ఇంధనాలు, చమురు, అద్దాలు, మైక్రోస్కోపులు, వైద్య పరికరాలపై ట్రంప్ ట్యాక్స్ పెంచారు. ఆయా వస్తువుల ధరలు పెరుగుతాయని ఆర్థికవేత్తలు ఆంధోళన చెందుతున్నారు.  

అమెరికా టారిఫ్ సుంకాల కారణంగా భారత్‌లో కొన్ని రంగాలు ప్రభావితమవుతాయి. సుంకాల కారణంగా ధరలు పెరిగితే వినియోగదారులు దూరమై కంపెనీలకు నష్టం జరుగుతుందని అంచనా. రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని అంటున్నారు. ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. ఇది వ్యవసాయ రంగానికి నష్టం చేస్తోంది.

ట్రంప్ ఇండియాను సుంకాల రారాజు అనడంపై సెబీ ఛైర్‌పర్సన్‌ తుహిన్‌కాంత పాండే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈయన గతంలో ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. తుహిన్ కాంత పాండే వివరాల ప్రకారం.. మన దేశానికి అమెరికా నుంచి దిగుమతయ్యే 8,562 ఉత్పత్తుల్లో 6,500 వస్తువులపై 10 శాతం కంటే తక్కువ సుంకాలే ఉన్నాయి. 8,400 ఉత్పత్తులపై 20శాతం కంటే తక్కువ సుంకాలే అమలవుతున్నాయి. 216 ఉత్పత్తులపై అసలు సుంకాలే లేవని వివరించారు.
2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వాటి సంఖ్య 260కి పెంచామని సెబీ ఛైర్మన్ తెలిపారు. 2025-26 బడ్జెట్‌లో వాటిని 260కి పెంచాం. అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై మొత్తం 17.7శాతం. అమెరికా నుంచి ఇండియా దిగుమతులు చేసుకునే వస్తువులపై 2.7శాతమే టారిఫ్ విధించామన ఆయన చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు