/rtv/media/media_files/2025/03/06/t3V6MQPuFpzkDPfsJJpg.jpg)
Trump Final Warnings Photograph: (Trump Final Warnings)
ఇజాయిల్ బందీలను వెంటనే వదిలిపెట్టకుంటే ఒక్క హమాస్ సభ్యుడు కూడా బతకడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. బందీలను విడిచిపెట్టి హాయ్ చెబుతారా? లేక పర్మినెంట్‌గా మీకు బాయ్ చెప్పమంటారా అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్ చేశారు. హమాస్ బందీలుగా ఉండి విడుదలైన కొందరిని ట్రంప్ బుధవారం వైట్ హౌస్‌లో కలిసి మాట్లాడారు. గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయిల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. హమాస్ వారిని పెట్టిన చిత్రహింసల గురించి విన్న ట్రంప్ ఆవేశంతో రగిలిపోయాడు.
President Trump met with eight released hostages from Gaza, listening to their heartbreaking stories. They expressed gratitude for his unwavering efforts to bring them & others home.
— The White House (@WhiteHouse) March 6, 2025
Hamas' actions have inflicted immense suffering, AND THEIR REIGN OF TERROR MUST BE STOPPED.🇺🇸🇮🇱 pic.twitter.com/Sy0G3fwSqL
Also read: Breaking: విదేశాంగ మంత్రి జైశకర్ పై ఖలీస్థానీల దాడికి యత్నం
తక్షణమే బందీలను విడుదల చేయకుంటే మీ చావు ఖాయమని హెచ్చరించారు. బందీలను, వారు చంపిన బందీల మృతదేహాలు ఇజ్రాయిల్‌కు అప్పగించాలని హెచ్చరించాలని ఆదేశించాడు. చనిపోయిన ఇజ్రాయిల్ పౌరుల మృతదేహాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు ట్రంప్. రోగులు, పిచ్చివారు మాత్రమే శవాలను వారి దగ్గర పెట్టుకుంటారని మండిపడ్డారు.
"'Shalom Hamas' means Hello and Goodbye - You can choose. Release all of the Hostages now, not later, and immediately return all of the dead bodies of the people you murdered, or it is OVER for you. Only sick and twisted people keep bodies, and you are sick and twisted! I am… pic.twitter.com/88EjVAyWAe
— President Donald J. Trump (@POTUS) March 5, 2025
హమాస్ ఇజ్రాయిల్ బందీలను వదిలేసి వెంటనే గాజాను విడిచి వెళ్లాలని ట్రంప్ పిలుపునిచ్చారు. గాజా ప్రజలకు బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తుందని విజ్ఞప్తి చేశారు. తాను చెప్పినట్లు వినకుంటే గాజాలో ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడని వార్నింగ్ ఇచ్చాడు.