/rtv/media/media_files/2025/08/19/isil-backed-rebels-killed-at-least-52-people-in-eastern-congo-2025-08-19-16-45-42.jpg)
ISIL-backed rebels killed at least 52 people in eastern Congo
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు. ఇటీల కాంగో దళాల చేతిలో అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ADF) సభ్యులు ఓడిపోయారు. అందుకే వాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారని అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు. లుబెరో, బెని ప్రాంతాల్లో పౌరులపై ADF తిరుగుబాటుదారులు క్రూరంగా దాడులు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు
నిద్రపోతున్న ప్రజలను లేపి మరి తాళ్లతో చేతులు కట్టేశారని.. ఆ తర్వాత కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపేశారని పేర్కొన్నారు. మెలియా అనే ఒక్క గ్రామంలోనే దాదాపు 20 మందిని చంపేసినట్లు చెప్పారు. ఈ ఊచకోతలో 8 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 52 మంది ADF తిరుగుబాటుదారులకు బలైనట్లు తెలిపారు. అంతేకాదు ఆ ముష్కరులు పలు ఇళ్లకు కూడా నిప్పంటించారన్నారు. ఈ దారుణం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?
ఇదిలాఉండగా ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి వద్ద కూడా తిరుగుబాటుదారులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 38 మంది మృతి చెందారు. అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ADF) అనేది ఇస్లామిక్ స్టేత్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న తిరుగుబాటు సంస్థ. ఈ సంస్థ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగా, ఉగాండా సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కొన్నేళ్ల నుంచి ఏడీఎఫ్ పౌరులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది. 2013 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 6 వేల మందికి పైగా ప్రజలను చంపేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏడీఎఫ్ సంస్థపై ఇప్పటికే అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలు ఆంక్షలు విధించాయి.
మరోవైపు ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులు ఎదుర్కొనేందుకు ఉగాండా, కాంగో సైన్యాలు సంయుక్తంగా సైనిక ఆపరేషన్లు చేపడుతున్నాయి. అంతేకాదు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు కూడా ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. కానీ ఆ తిరుగుబాటుదారుల దాడులు అదుపుచేయడంలో మాత్రం ఇంకా సవాళ్లు వస్తూనే ఉన్నాయి. 1995లో కాంగోలో రెండు ఉగాండా తిరుగుబాటు సంస్థల కలయికతోనే ఈ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) ఏర్పడింది. ఉగాండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ గ్రూప్‌ను ప్రారంభించారు.
Also Read: ఇస్రో నుంచి మరో అద్భుతం.. త్వరలో 40 అంతస్తుల జంబో రాకెట్
వీళ్లు 1996లో ఉగాండాలోని బ్వేరా, మ్పొండ్వే-లుభిరిహా పట్టణాలపై దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఏడీఎఫ్ ఉగాండా సైన్యం, పౌరులపై కూడా దాడులు చేసింది. 2014 తర్వాత కాంగోలోని నార్త్ కివు ప్రాంతంలో అనేక సామూహిక హత్యలకు పాల్పడింది. ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) ఉగ్రసంస్థతో సంబంధాలు ఏర్పరుచుకుంది.