Pakistani Muslims: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు

బ్రిటన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం యువకులు రెచ్చిపోయారు. భారతీయ ముస్లిం యువతులను వేధించారు. జాతీయ జెండా పట్టుకొని వీధుల్లో యువతులు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన పలువురు పాకిస్థానీయులు ఆ యవతులను దూషించారు.

New Update
pakistani Muslims caught harassing and heckling Indian Muslim women

pakistani Muslims caught harassing and heckling Indian Muslim women


బ్రిటన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం యువకులు రెచ్చిపోయారు. భారతీయ ముస్లిం యువతులను వేధించారు. జాతీయ జెండా పట్టుకొని వీధుల్లో యువతులు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన పలువురు పాకిస్థానీయులు ఆ యవతులను దూషించారు. పాక్‌ జెండాను వాళ్ల ముఖంపై ఊపారు. అసభ్యకర సైగలు చేస్తూ ఎగతాళి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటీజన్లు ఆ పాకిస్థానీ యువకులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. చివరికి విదేశాల్లో కూడా పాకిస్థానీయులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?

Also Read: మళ్ళీ హాట్ టాపిక్ అయిన జెలెన్ స్కీ డ్రెస్..రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఇదిలాఉండగా ఇటీవల యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి జరగడం కలకలం రేపింది. వోల్వర్‌హాంప్టన్ రైల్వేస్టేషన్ వద్ద ఆగస్టు 15న ఇద్దరు సిక్కు వ్యక్తులుపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ జాత్యహంకార దాడిని సిక్కూ కమ్యూనిటీ వాసులు తీవ్రంగా ఖండించారు. యూకేలో సిక్కుల భద్రత గురించి అధికార ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరుతున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

Also Read: ట్రంప్, జెలెన్‌స్కీ భేటీకి ముందు ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఏడుగురు మృతి

ఈ ఘటన తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై ఆ నిందితులు విడుదలైనట్లు తెలుస్తోంది. యూకే ఎంపీ సురీనా బ్రాకెన్‌రిడ్జ్‌ కూడా ఈ జాత్యహంకార దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సంబంధించి రిపోర్టును అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వోల్వర్‌హాంప్టన్‌లో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని  విజ్ఞప్తి చేశారు.

Also Read: ఆ దేశంలో పెళ్ళికి ముందే HIVతో పాటు ఆ పరీక్షలు.. ! ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు