/rtv/media/media_files/2025/08/19/isro-2025-08-19-15-14-46.jpg)
ISRO
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నుంచి మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఏకంగా 40 అంతస్తుల భవనంత ఎత్తు ఉండే భారీ రాకెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియ యూనివర్సిటిలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఈ ఏడాది నావిక్ శాటిలైట్, ఎన్1 రాకెట్ ప్రయోగం, అలాగే అమెరికాకకు చెందిన 6500 కిలోల బరువుతో ఉండే కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం లాంటి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు
గతంలో అబ్దుల్ కలామ్ చేసిన ప్రాజెక్టు గురించి ఓ కీలక విషయం పంచుకున్నారు. అప్పట్లో ఆయన తయారు చేసిన తొలిరాకెట్ 17 టన్నుల లిఫ్ట్ఆఫ్ బరువుతో 35 కిలోల శాటిలైట్‌ను దిగువ భూకక్ష్యకు చేర్చినట్లు చెప్పారు. ఈరోజు 75 టన్నుల బరువైన పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టంపై పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి కావాల్సిన రాకెట్ 40 అంతస్తుల భవనం ఎత్తు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం భారత్‌కు కక్ష్యలో 55 శాటిలైట్‌లు ఉన్నాయన్నారు. ఇక వచ్చే 3-4 ఏళ్లలో వీటి సంఖ్య మూడు నాలుగు రేట్లు పెరుగుతుందని తెలిపారు.
ఇదిలాఉండగా ప్రస్తుతం ఇస్రో.. టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ శాటిలైట్ (TDS), నౌకాదళం కోసం రెడీ చేసిన జీశాట్ 7 ఆర్ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. త్వరలో దీన్ని ప్రయోగించనున్నారు. ఇప్పుడు కక్ష్యలో ఉన్న జీశాట్ 7(రుక్మిణి) స్థానంలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఓయూలో జరిగిన స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన సేవలు చేసినందరు ఈ పురస్కారం దక్కింది. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ పురస్కారాన్ని నారాయణన్‌కు అందించారు.
Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?
ఇదిలాఉండగా ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఈ మిషన్ ద్వారా ముగ్గరు భారతీయ వ్యోమగాములను 400 కి.మీ ఎత్తులో అంతరిక్షంలోకి పంపించనున్నారు. 2026లో ఈ ప్రాజెక్టు చేపట్టాని ఇస్రా ప్లా్న్ చేస్తోంది. భారత్ మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర కూడా ఇదే. ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ అయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.
ఇటీవల చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇస్రో చంద్రయాన్ 4 పై కూడా పనిచేస్తోంది. చంద్రుడి ఉపరితలం నుంచి నమునాలు సేకరించి భూమిపైకి తీసుకురావాలనే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడున్నారు. ఈ మిషన్ కోసం ఇస్రో రెండు వేరువేరు ప్రయోగాలు నిర్వహిస్తోంది. 2027 నాటికి ఈ మిషన్ ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: రైల్వే ప్రయాణీకులకు బిగ్ షాక్.. IRCTC బాదుడే బాదుడు