ఊచకోత.. 52 మందిని కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపేశారు
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
ఉగ్రవాద సంస్థలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. దాడులు చేయడానికి డిజటల్ పే, ఈ కామర్స్ ల ద్వారా మనీ సేకరిస్తున్నాయి అని చెబుతోంది ఎఫ్ఏటీఎఫ్. పుల్వామా దాడే ఇందుకు ఉదాహరణ అని చెబుతోంది.
దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ముంబై ఎయిర్ పోర్టు సమీపంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జకార్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్షేక్, తల్హాఖాన్లు గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు.
అగ్రరాజ్యం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అమెరికా ఇరాక్‌లో జరిపిన క్షిపణి దాడిలో ఐసిస్ అగ్రనేత అబు ఖదీజాను హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ప్రకటించగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తామే హతమార్చినట్లు తెలిపాడు.
పదేళ్ల తర్వాత ఐసీస్ చేరనుంచి విడుదలైన 'జియా అమీన్ సిడో' తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వెల్లడించింది. యజిదీ శిశువులను చంపి, వారి మాంసం తమకు వండిపెట్టారని చెప్పింది. తన ఇద్దరు పిల్లలు ఇంకా ఐసీస్ చేతిలోనే ఉన్నారంటూ కన్నీరుపెట్టుకుంది.
సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. 37 మంది ఉగ్రవాదులను వైమానిక దాడుల్లో హతమార్చామని అమెరికా ప్రకటించింది. వీళ్లందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నవారేనని పేర్కొంది.
రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని నిర్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని బంధించిన ఖైదీల్లో కొందరికి కాల్చి చంపి జైలు సిబ్బందిని రక్షించారు.