America encounter : అమెరికాలో కత్తితిప్పిన సిక్కు వ్యక్తి...ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

అమెరికా లాస్‌ ఏంజిల్స్ లో ఒక సిక్కు వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. నడిరోడ్డుపై సిక్కు యుద్ధ కళ గట్కా ప్రదర్శి్స్తూ ఆ వ్యక్తి వీరంగం సృష్టించాడు. యువకున్ని అడ్డుకునే ప్రయత్నించినప్పటికీ వినకపోవడంతో అక్కడికక్కడే ఎన్‌ కౌంటర్‌ చేశారు.

New Update
America encounter6

America encounter

America encounter : అమెరికా లాస్‌ ఏంజిల్స్ లో ఒక సిక్కు వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. నడిరోడ్డుపై సిక్కు యుద్ధ కళ గట్కా ప్రదర్శి్స్తూ ఆ వ్యక్తి వీరంగం సృష్టించాడు. యువకున్ని అడ్డుకునే ప్రయత్నించినప్పటికీ వినకపోవడంతో అక్కడికక్కడే ఎన్‌ కౌంటర్‌ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో పుటేజ్ ను కూడా పోలీసులే విడుదల చేయడం గమనార్హం.

Also Read :   Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

అమెరికా లాస్ ఏంజిల్స్ లో 35 ఏళ్ల గుర్‌ ప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్రాచీన యుద్ధ కళ అయిన గట్కా ప్రదర్శన చేశాడు. అయితే అతన్ని పోలీసులు షూట్‌ చేశారు. అయితే ఈ ఘటన జులై 13న  జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అతన్ని కాల్చిన వీడియోలను లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ (LAPD) విడుదల చేసింది. 

ఇది కూడా చదవండి:మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

గురుప్రీత్ సింగ్ నడిరోడ్డుపై గట్కా ప్రదర్శిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఆయన లాస్ ఏంజిల్స్ లోని Crypto.com Arena ఎదుట రెండు వైపుల పదునున్న కత్తి లాంటి ఆయుధంతో గట్కా ప్రదర్శించాడు. భారత్‌లోని పంజాబ్ కు చెందిన మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఈ విద్యను ప్రదర్శిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. అదే విధంగా జనాలను బెదిరించాడు. అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. గుర్‌ప్రీత్‌ సింగ్‌ చేష్టలతో జనం భయాందోళనలకు గురయ్యారు. షార్ట్, బనియన్, బ్లూరిబ్బన్  ధరించి రోడ్డు మీదకు వచ్చిన గుర్‌ప్రీత్‌ సింగ్‌ కత్తితో నానా హంగామా చేశాడు.  గట్కాకళను ప్రదర్శిస్తూనే అందిరినీ బెదిరించాడు. యువకున్ని  అమెరికా పోలీసులు అడ్డుకున్నారు.అయినా పోలీసుల సూచనలను గుర్‌ప్రీత్ సింగ్ పట్టించుకోలేదు.అతన్ని ఆపాలని పోలీసులు ప్రయత్నించినఆయుధం పడేయాలని చెప్పినా వినకుండా దగ్గరికెళ్లిన పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. అంతేకాకుండా ఏకంగా తన నాలుక తానే కోసుకుని భయపెట్టాడు. 

పోలీసులు అతని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయడంతో కారులో ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశాడు. రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కారు నడిపి చాలా వాహనాలను ఢీకొట్టాడు. కారు అద్దంలో నుంచి కత్తిని చూపిస్తూ దారివెంట పోయేవారిని బెదిరిస్తూ డ్రైవ్ చేస్తూ  అలజడి సృష్టించాడు. అతన్ని అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడిచేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని షూట్ చేసినట్లు LAPD పోలీసులు తెలిపారు.  ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారగా మానవహక్కుల సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒక మనిషిని ఎలా కాల్చి చంపుతారని ప్రశ్నించాయి.

Also Read:  Trump Tariffs Effect: ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. ఆ క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!

Advertisment
తాజా కథనాలు