Dubai Passport: దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం... పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది!

దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది అక్కడి గవర్నమెంట్. కొత్త రూల్స్ ప్రకారం.. ఫోటో స్పష్టంగా ఉండాలి, బ్యాగ్రౌండ్‌ తెల్లగా ఉండాలి. ఫోటో సైజ్‌ 630x810 పిక్సెల్స్ ఉండాలి.

New Update
dubai

Dubai Passport

Dubai Passport: దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది అక్కడి గవర్నమెంట్. కొత్త రూల్స్ ప్రకారం.. ఫోటో స్పష్టంగా ఉండాలి, బ్యాగ్రౌండ్‌ తెల్లగా ఉండాలి. ఫోటో సైజ్‌ 630x810 పిక్సెల్స్ ఉండాలి. ఫోటోలో ఫేస్‌ 85 శాతం స్పష్టంగా కనిపించాలి. ఫోటోలో ఎలాంటి హవాభావాలు ఉండకూడదు. ఫోటో మొత్తం ఒకే రకమైన లైటింగ్ ఉండాలి.  ఫోటోను ఎడిట్ చేయడం, ఫిల్టర్లు వాడడం చేయకూడదు.  కళ్లజోడు ధరించకూడదు. ముఖంపై ఎలాంటి వస్త్రాలు కప్పుకోకూడదు.

Also Read:Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

ముఖంపై ఎలాంటి నీడలు లేదా మెరుపులు ఉండకూడదు. చర్మం రంగు సహజంగా కనిపించాలి. దరఖాస్తుకు సమర్పించే ఫోటో మూడు నెలల కంటే పాతది కాకూడదు. మతపరమైన కారణాల వల్ల తల కప్పుకునే వారికి మినహాయింపు ఉంది.  కానీ ముఖంలోని అన్ని భాగాలు (గడ్డం నుండి నుదురు వరకు, ముఖం అంచులు) స్పష్టంగా కనిపించాలి.ఈ కొత్త నిబంధనలు  సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Also Read: Karimnagar : ఎంత మంది గోసనో.. ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి.. ఊర్లో సంబరాలు!

బయోమెట్రిక్ ప్రమాణాలకు అనుగుణంగా

ఈ మార్పులు ప్రధానంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) బయోమెట్రిక్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. నిబంధనలు పాటించకపోతే పాస్ట్‌పోర్టు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందువల్ల, దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ మార్పులను పాటించాలని దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్ సూచించింది.  దీనివల్ల పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ వేగవంతం అవడంతో పాటు, భద్రత కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడుతుంది. కాగా UAEలో దాదాపు 4 లక్షల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. 

Also Read: మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

Advertisment
తాజా కథనాలు