Khamenei Death Protests : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి..  వెల్లువెత్తిన నిరసనలు

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ  మృతి చెందిన విషయాన్ని ఆ దేశం ధృవీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు చనిపోయినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది.

New Update
Ali Khamenei

Khamenei Death Protests :  అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ(Attack On Khamenei House) మృతి చెందిన విషయాన్ని ఆ దేశం ధృవీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు చనిపోయినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. ఖమేనీ(Ali Khamenei Chapter Close ?) కుమార్తె, అల్లుడు, మనవరాలితో పాటు కోడలు కూడా మరణించినట్టు సమాచారం.భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా, ఖమేనీకి సంతాప సూచకంగా ఆందోళనలు మిన్నంటాయి. భారత్‌లోని లడఖ్, పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాల్లో.. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఆ దేశాలకు వ్యతిరేకంగా నల్లజెండాలు పట్టుకుని పలువురు వీధుల్లోకి వచ్చి  నినాదాలతో ఇరాన్‌పై దాడులను ఖండించారు.

Also Read :  ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తదుపరి సుప్రీంలీడర్‌ ఎన్నికకు ఏర్పాట్లు

జమ్ముకశ్మీర్‌ లెహ్‌లోని లడాఖ్ ప్రాంతంలో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ.. ఇజ్రాయెల్(iran israel war), అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇరాన్‌కు మద్ధతు తెలుపుతూ.. ఖమేనీ చిత్రాలు, నల్ల జెండాలు, ఇరాన్‌కు మద్దతిచ్చే బ్యానర్లతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. 'నేడు మా ప్రియతమ నాయకుడు అలీ ఖమేనీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంతాప సభను మా నగరంలో శాంతియుతంగా నిర్వహిస్తాం' అని ఆందోళన కారులు స్పష్టం చేశారు. 


ఇరాన్‌కు మద్దుతుగా పాకిస్థాన్‌లోనూ ఇరాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది.  ఆందోళన కారులు కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఇరాన్ మద్దతుదారులు కర్రలు, రాళ్లతో అమెరికన్ కాన్సులేట్ భవనంపై దాడికి దిగారు. అక్కడి పలు భవనాలకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ పలు భవనాలు ఆగ్నికి ఆహుతయ్యాయి.

మధ్య ఇరాన్‌లోని ఇస్‌ఫహాన్ నగర ప్రజలు ఇమామ్ స్క్వేర్ వద్దకు చేరుకుని ఖమేనీ మరణం పట్ల సంతాపం తెలిపారు. వారంతా సమూహంగా ఏర్పడి దివంగత సుప్రీం లీడర్‌కు సంతాపం తెలిపారని అక్కడి ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రకటించింది. అలాగే ఇరాన్ ఈశాన్య నగరమైన మషాద్‌లోని ఇమామ్ రెజా మందిరం వద్ద కూడా ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్.. దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఖమేనీకి సంతాపం తెలుపుతూ.. ఆ దేశంలో జాతీయ పతకాలను అవనతం చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో 37 ఏళ్ల అధ్యాయానికి తెరపడిందని పలువురు నివాళులర్పించారు.

ఖమేనీ మరణంతో కొత్త సుప్రీం నాయకుడి ఎవరా అన్న సందిగ్ధానికి తెరదించింది ఇరాన్. అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడైన మోజ్తబా ఖమేనీ.. తదుపరి లీడర్‌గా కొనసాగుతారని ప్రకటించింది. ప్రస్తుతం.. ఖోమ్‌ నగరంలోని విద్యాలయంలో మతాచార్యుడిగా పనిచేస్తున్న మొజ్తబా.. ఇకపై ఖమేనీ వారసుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 1987-88లో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో మొజ్తబా పాల్గొనడం గమనార్హం.

Also Read :  47 ఏళ్లుగా అమెరికా కుట్రలు..ఇక ఇరాన్ సామ్రాజ్యం కుప్పకూలినట్లేనా?

అల్లాకు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది.. ఖురాన్ పోస్ట్.. 

అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ తర్వాత ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఆ తర్వాత ఖమేనీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఖురాన్ నుంచి ఒక అరబిక్ సూక్తితో కూడిన పోస్ట్ పెట్టింది.
 
'అపార కరుణామయుడు అయిన అల్లా నామస్మరణలో కొందరు పురుషులు ఉన్నారు. వారు అల్లాతో చేసిన ఒప్పందానికి నిజాయితీగా నిలిచారు. వారిలో కొందరు తమ ప్రతిజ్ఞను (ప్రాణత్యాగంతో) పూర్తిచేశారు. మరికొందరు ఇంకా ఎదురుచూస్తున్నారు. వారు తమ ఒప్పందాన్ని ఎప్పటికీ మార్చుకోలేరు' అంటూ ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. 1989 నుంచి ఇరాన్‌నుకు  సుప్రీం లీడర్ గా ఉన్న 86 ఏళ్ల ఖమేనీ వీడ్కోలును ఈ పోస్ట్ సూచిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు