/rtv/media/media_files/2026/03/01/iran-rushes-to-elect-next-supreme-leader-three-member-advisory-council-formed-2026-03-01-14-52-44.jpg)
Iran Rushes To Elect Next Supreme Leader Three Member Advisory Council Formed
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇరాన్ పాలన త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లింది. తాత్కాలికంగా పరిపాలన బాధ్యతలు చూసేందుకు ముగ్గురు సభ్యుల కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఇరాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: పాకిస్థాన్‌లో అమెరికా కాన్సులేట్‌పై దాడి.. ఇరాన్‌కు మద్దతుగా నినాదాలు!
ఈ త్రిసభ్య కౌన్సిల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఒక జ్యూరీ సభ్యుడు.. ఈ ముగ్గురూ ఉంటారు. ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రమే ఈ కౌన్సిల్ పరిపాలన బాధ్యతలు తీసుకుంటుంది. గార్డియన్ కౌన్సిల్ కూడా ఆ దేశంలోని శక్తిమంతమైన విభాగాల్లో ఒకటిగా పిలుస్తారు. ఇందులో 88 మంది సభ్యులు ఉంటారు. వీళ్లను అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా అంటారు.
Also Read: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. ఎవరూ ఊహించని రీతిలో దాడులు చేస్తాం!
ఇరాన్ చట్టం ప్రకారం చూసుకుంటే సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అధికారం గార్డియన్ కౌన్సిల్‌కు ఉంది. అయితే ఈ ఎన్నిక కోసం గార్డియన్ కౌన్సిల్ త్రిసభ్య కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తుంది. గార్డియన్ కౌన్సిల్లో 8 ఏళ్ల పదవీకాలంతో షియా మత గురువులు సైతం సభ్యులుగా ఉంటారు. ఈ గార్డియన్ కౌన్సిల్ రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. ఇదిలాఉండగా అలీ ఖమేనీ రెండవ కొడుకైన మోజ్తబా ఖమేనీకి సుప్రీం లీడర్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Follow Us