Gun Fire in AP: అన్నమయ్య జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై నాటు తుపాకితో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.