/rtv/media/media_files/2025/07/24/india-uk-2025-07-24-17-29-50.jpg)
India-UK
చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. నేడు లండన్‌లో జరిగిన సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు కూడా ఎక్కువ అవుతాయి. దీనితో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ ప్రపంచ స్థాయిలో మరింత బలంగా మారుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం వల్ల సామాన్య ప్రజలకు లాభమా? నష్టమా? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి:Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
తక్కువ ధరకే..
భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ఉక్కు, లోహం, విస్కీ, ఆభరణాలు వంటివి తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.
ధరలు పెరగనున్నవి..
వ్యవసాయ ఉత్పత్తులు, కార్లు, బైక్‌లు వంటి కొన్ని వస్తువులు మాత్రం ఖరీదైనవిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Hari Hara Veeramallu: హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...
ఈ ఒప్పందం ఎలా మొదలైంది?
ఈ ఒప్పందం గురించి చర్చలు 2022 జనవరిలో అప్పటి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో మొదలయ్యాయి. 2024 నాటికి దీన్ని పూర్తి చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యం అయ్యింది. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. 2030 నాటికి భారతదేశం, బ్రిటన్ మధ్య వ్యాపారం 120 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యాన్ని ఈ ఒప్పందం నిర్దేశించింది.
ఇది కూడా చూడండి:11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్ బోర్డుకు తరలింపు..
'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' అంటే?
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు తమ ఉత్పత్తులపై విధించే పన్నులను (సుంకాలు) తగ్గించుకోవడం లేదా పూర్తిగా తొలగించుకోవడం. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత, ఆయా దేశాల మధ్య వస్తువులు కొనడం, అమ్మడం సులభం అవుతుంది. పన్నులు ఉండవు లేదా చాలా తక్కువగా ఉంటాయి.
మనకేంటి లాభం?
భారతదేశం-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశం నుంచి యూకేకి ఎగుమతి అయ్యే దాదాపు 99% ఉత్పత్తులపై పన్నులు ఉండవు. అంటే అవి యూకే మార్కెట్లో చాలా చౌకగా లభిస్తాయి. అలాగే, బ్రిటన్ నుంచ భారతదేశానికి వచ్చే 90% ఉత్పత్తులపై కూడా పన్నులు తగ్గుతాయి. దీనివల్ల భారత ప్రజలకు లాభం చేకూరనుంది.