China: అమ్మో.. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన పెంటగాన్..
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య 100 పెరిగినట్లు సమాచారం. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్హెడ్లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030కి 1000కి చేరే అవకాశం ఉండనున్నట్లు పెంటగాన్ వెల్లడించింది.