/rtv/media/media_files/2025/12/06/modi-and-putin-2025-12-06-16-34-48.jpg)
IIndia-Russia agreements in areas of defence, trade, economy and healthcare
రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్ పర్యటించిన సంగతి తెలిసిందే. 23వ భారత్-రష్యా(india-russia) వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) తో ఆయన సమావేశమయ్యారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుతిన్ పర్యటనలో భాగంగా 'రికార్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్' (RELOS) ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాలు లాజిస్టిక్ మద్దతు కోసం ఈ సౌకర్యాలను ఒకరినొకరు వినియోగించుకోవచ్చు. దీనివల్ల ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, మానవతా సహాయక కార్యకలాపాలు అలాగే విపత్తు సహాయక చర్యల సమయంలో ఇంధనం, విడిభాగాలు, మరమ్మతు సౌకర్యాలను పరస్పరం అందించుకునేందుకు మార్గం సులభతరం అవుతుంది.
Also Read : భగవద్గీత, అస్సాం టీ, వెండి గుర్రం.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన విలువైన బహుమతులు ఇవే !
మరిన్ని S-400 స్క్వాడ్రన్లు
S-400 స్క్వాడ్రన్ల అదనపు డెలివరీలు, అత్యాధునికి SU-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, అలాగే S-500 అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్ట్ వ్యవస్థల కొనుగోలుపై చర్చలు జరిపారు. మరో అయిదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగనట్లు తెలుస్తోంది. అలాగే మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఏకే-203 రైఫిళ్లు, బ్రహ్మోస్ క్షిపణులు, రష్యా నుంచి సరఫరా అయ్యే రక్షణ పరికరాల విడిభాగాలు, ఇతర ఉత్పత్తులను ఉమ్మడి తయారీని ప్రోత్సహించడం కోసం ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి.
2024-25 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $68.7 బిలియన్లకు చేరగా.. 2030 నాటికి $100 బిలియన్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అంతేకాదు యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) త్వరగా పూర్తి చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించాయి. కస్టమ్స్, పోస్టల్ సేవలు ఎరువుల సరఫరా వంటి రంగాల్లో వాణిజ్య లాజిస్టిక్స్‌ను సులభతరం చేసేందుకు కూడా ఒప్పందాలు కుదిరాయి.
Also Read : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు.. విఫలమైన కాల్పులు విరమణ
తక్కువ ధరకే చమురు
ఇంధన భద్రత, పౌర అణు సహకారం భారత్-రష్యా భాగస్వామ్యంలో కీలక స్థాలను కలిగి ఉన్నాయి. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. తక్కువ ధరకే ముడి చమురును నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కట్టుబడి ఉంటామని పుతిన్ ప్రకటించారు. అలాగే కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి (KKNPP) సంబంధించి, చిన్న రియాక్టర్ల తయారీపై చర్చలు జరిగాయి. అణుశక్తి రంగంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే ఇరు దేశాల పౌరులు తాత్కాలికంగా పని చేసేందుకు వీలు కల్పించే తాత్కాలిక కార్మిక కార్యకలాపాల ఒప్పందంపై కూడా సంతకాలు జరిగాయి.
ఇక రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఇ-టూరిస్ట్ వీసాను అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అలాగే అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌లో చేరేందుకు రష్యా అంగీకరించింది. సముద్ర సహకారం ఆహార భద్రత, వైద్య విద్య, ప్రసార మాధ్యమాల సహకారం వంటి రంగాల్లో కూడా చాలావరకు అవగాహన ఒప్పందాలు జరిగాయి. పుతిన్ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసింది. రక్షణ రంగంలో నిబద్ధతను బలోపేతం చేయడమే కాకుండా ఆర్థిక, సాంస్కృతిక సహకారంలో కొత్త మార్గాలను తెరిచింది.
Follow Us