Pak-Afghan: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు..విఫలమైన కాల్పులు విరమణ

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సరిహద్దులో కాల్పులు జరిగాయి. అయితే ఇవి ఎవరు మొదలుపెట్టారన్నది మాత్రం తెలియడం లేదు. పాక్ , ఆఫ్ఘాన్ లు రెండు నువ్వంటే నువ్వని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.

New Update
pak-afghan

శుక్రవారం రాత్రి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో భారీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఇరు దేశాల మధ్యనా శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో నిన్న రెండు దేశాలు ఒకరి ఒకరు కాల్పులు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పులు ఎవరు మొదలుపెట్టారననది మాత్రం స్పష్టం లేదు. పాక్, ఆఫ్ఘాన్ రెండూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.

సరిహద్దుల్లో భారీ కాల్పులు..

కాందహార్ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డక్ ప్రాంతంలో పాకిస్తాన్ దాడులు ప్రారంభించిందని ఆఫ్ఘన్తాలిబన్ ప్రతినిధి జబీహుల్లాముజాహిద్ ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా చమన్ సరిహద్దులో "ఎటువంటి కవ్వింపు లేకుండా ఆఫ్ఘాన్ దళాలే కాల్పులకు పాల్పడిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్తాన్ అప్రమత్తంగా ఉందని..తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజలను రక్షించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పాక్ ప్రధాన మంత్రి ప్రతినిధి మోషారఫ్జైదీ అన్నారు. ఆఫ్ఘన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులు ఇటీవల తమ దేశంలో దాడులు చేశారని, వాటిలో ఆత్మాహుతి బాంబు దాడులు కూడా ఉన్నాయని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ కాబూల్ మాత్రం ఈ వాదనలను తిరస్కరించింది. పాకిస్తాన్ అంతర్గత భద్రతా సవాళ్లకు తాము బాధ్యత వహించలేమని నొక్కి చెబుతోంది.

మళ్ళీ చర్చలు విఫలం..

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు పదేపదేవిఫలమవుతున్నాయి. నెల రోజుల క్రితం తాత్కాలిక కాల్పుల విరమణకు రెండు దేశాలూ ఒప్పుకున్నాయి. అయితే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే సాగింది. ఆ సమయంలో కూడా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. తాజాగా ఇప్పుడు మరోసారి పాక్, ఆఫ్ఘాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఖతార్, టర్కీల మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియాలో జరిగిన శాంతి చర్చలు ఎటువంటి సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

Advertisment
తాజా కథనాలు