/rtv/media/media_files/2025/12/06/modi-and-putin-2025-12-06-14-21-22.jpg)
Modi and Putin
రష్యా(russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Kim Vladimir Putin) భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్‌కు ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకమైన, విలువైన బహుమతులను అందించారు. డిసెంబర్ 4-5 తేదీల్లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ కానుకలను బహుకరించారు. తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర, ఉత్తరాన కశ్మీర్ వరకు మన వారసత్వాన్ని తెలియజేసేలా బహుమతులను అందించారు. పుతిన్-మోదీ భేటీ మధ్య కీలకంగా మారిన బహుమతులు ఏంటో ఓసారి చుద్దాం.
మన దేశ పర్యటనకు వచ్చిన పుతిన్ కు ప్రధాని మోదీ(PM Modi) 6 విలువైన బహుమతులను అందించారు. భారతీయ సంస్కృతి, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా కానుకలను బహుకరించారు. ముఖ్యంగా రష్యన్‌లో అనువాదించిన భగవద్గీతతో పాటు అస్సాం, కాశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆగ్రా కళలను ప్రతిబింబించే అరుదైన వస్తువులను అందించారు. ఇందులో బలమైన బంధాలకు చిహ్నంగా నిలిచే చేతితో చెక్కిన వెండి గుర్రం, రుచిగల అస్సాం బ్లాక్ టీ, కశ్మీర్ కుంకుమ పువ్వు, అలంకరించిన సిల్వర్ టీ సెట్, ఆగ్రా పాలరాతి చదరంగం సెట్ వంటివి ఉన్నాయి. ఈ కానుకలు కేవలం స్నేహానికి మాత్రమే కాకుండా మన దేశ గొప్ప వారసత్వానికి, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచాయి.
Also Read: విమాన ప్రయాణికులకు ఉపశమనం.. రైళ్లలో 116 అదనపు కోచ్‌లు
PM Modi's Gifts To Putin
రష్యన్ భాషలోకి అనువాదం చేసిన శ్రీమద్ భగవద్గీత కాపీని ప్రధాని మోదీ స్వయంగా పుతిన్‌కు అందించారు మోదీ. మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన ధర్మం, శాశ్వత మోక్షం గురించి మార్గదర్శకాన్ని ఈ గ్రంథం అందిస్తుంది. భగవద్గీత కాలాతీత జ్ఞానం నైతిక జీవనాన్ని, మనస్సు నియంత్రణను, అంతర్గత శాంతిని ప్రేరేపిస్తుందని.. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని మోదీ అన్నారు. ఆ తర్వాత సారవంతమైన బ్రహ్మపుత్ర మైదానాల్లో పెరిగే అస్సాం బ్లాక్ టీని అందించారు. మంచి రుచికి, ప్రకాశవంతమైన ద్రవానికి అస్సాం బ్లాక్ టీ ప్రసిద్ధి చెందింది. 2007లో GI ట్యాగ్ పొందిన ఈ తేయాకు.. భూమి, వాతావరణం, హస్తకళల గొప్ప వారసత్వాన్ని సూచిస్తుంది.
అలాగే మహారాష్ట్ర స్వర్ణకారులు తయారు చేసిన ఓ వెండి గుర్రాన్ని కూడా పుతిన్‌కు అందజేశారు మోదీ. ఈ వెండి గుర్రం భారతదేశ లోహపు హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది భారతీయ, రష్యన్ సంస్కృతుల్లో గౌరవం, ధైర్యాన్ని సూచిస్తుంది. గుర్రం ఆకారం భారత్-రష్యా భాగస్వామ్యం.. శాశ్వతమైన, నిరంతర పురోగతికి ప్రతీకగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్‌లోని గొప్ప కళాత్మకతను ప్రతిబింబిస్తూ, క్లిష్టమైన చెక్కడాలతో రూపొందించిన ముర్షిదాబాద్ వెండి టీ సెట్‌ను ఇచ్చారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని, టీ సంస్కృతి ప్రాముఖ్యతను పంచుకుంటుంది.
Also Read: పుతిన్‌కి చేతికి మొసలి తోలు గడియారం; ధర వింటే షాక్ అవుతారు
ఇక ఆగ్రాకు చెందిన రాయి, అది కూడా చేతులతో తయారు చేసిన పాలరాతి చదరంగం సెట్‌ను పుతిన్‌కు అందజేశారు. వీటితో పాటు కశ్మీర్ ఎత్తైన ప్రాంతాల్లో సాగు చేసే కశ్మీరీ కుంకుమ పువ్వును బహుమతిగా ఇచ్చారు. ఇది రంగు, సువాసన, రుచికి ప్రసిద్ధి చెందడంతో పాటు సాంస్కృతిక, వంటల ప్రాముఖ్యత కూడా ఉంది. మొత్తంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు అందించిన బహుమతులు కేవలం వస్తువులు మాత్రమే కాదు.. అవి భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీటి ద్వారా మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేశారు.
Follow Us